YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కేజ్రీవాల్ కు మద్ధతుగా తెలంగాణలో రిలే నిరాహార దీక్షలు ఢిల్లీ ప్రభుత్వంపై వేధింపులు మానాలి

కేజ్రీవాల్ కు మద్ధతుగా తెలంగాణలో రిలే నిరాహార దీక్షలు  ఢిల్లీ ప్రభుత్వంపై వేధింపులు మానాలి
ఢిల్లీ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ కక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి భారత సుదర్శన్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్షకు మద్ధతుగా తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం'పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికార ప్రతినిధులు సుదర్శన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు గత నాలుగు నెలల నుంచి విధులలో పాల్గొనకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇంటింటికీ రేషన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినివ్వకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరాహార దీక్షలో పార్టీ  రాష్ట్ర అధికార ప్రతినిధులు భారత సుదర్శన్, ముస్సావిర్ లతో పాటుగా నాయకులు రుషి, రాము గౌడ్, కిరణ్, నర్సింహ, హుస్సేన్, సాయిలు, జానీ, గఫార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts