
ఎమ్మిగనూరు ఏప్రిల్ 11
ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు శుక్రవారం నాడు మహా ధర్నా నిర్వహించారు. డిపో ఆవరణలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ ద్వారా తమ న్యాయమైన డిమాండ్లపై ఘనంగా నిరసన వ్యక్తం చేశారు. ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం డిపో అధ్యక్షుడు ఎస్.ఎం. రఫీక్, కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ ల సమన్వయంతో నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.పి.ఎం. సాహెబ్ ప్రసంగిస్తూ, "రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిటిడి ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే గత ఏడాది నవంబర్ 5న గౌరవ మేనేజింగ్ డైరెక్టర్‌కు మెమొరాండం అందజేశాం. సమస్యలు పరిష్కరించకపోవడంతో మళ్లీ మార్చి 25న మరోసారి మెమొరాండం ఇచ్చాం. అయినప్పటికీ స్పందన లేకపోవడం దురదృష్టకరం," అని విమర్శించారు. రాబోవు కాలంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అందరూ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.