YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎస్బిఐ బ్యాంకు లో భారీ అగ్నిప్రమాదం

ఎస్బిఐ బ్యాంకు లో భారీ అగ్నిప్రమాదం

వికారాబాద్
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ ఎస్బిఐ బ్యాంకు నందు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9.30 నిమిషాలకు బ్యాంకు సెక్రటరీ గార్డు బ్యాంకు తాళాలు తీసి చూడగా ఒకసారిగా పోగలు వ్యాపించాయి దీంతో సెక్రెటరీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఉన్నత అధికారులు వచ్చి చూసేసరికి భారీగా మంటలు బ్యాంకు వ్యాపించ సాగాయి దీంతో అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కోడంగల్ నుంచి ఫైర్ ఇంజన్ రావడం జరిగింది దీంతో మంటలు ఆర్పడం కొనసాగుతుంది అయితే బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా మరి ఏదైనా ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే బ్యాంకులో సరైన ప్రమాణాలు లేకపోవడం మని మరికొందరు అనుమానిస్తున్నారు బ్యాంకు పై భాగంలో ఇటీవల థర్మ కోల్ షీట్స్ తో పై కప్పు ఫర్నిచర్ గా ఏర్పాటు చేశారని దీని ద్వారా కూడా మంటలు అధికంగా వ్యాపించాయని పలువురు అనుమానిస్తున్నారు దీంతో పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక బ్యాంకుకు భద్రత ప్రమాణాలు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది

Related Posts