YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంటాకు వార్నింగ్...

గంటాకు వార్నింగ్...

విశాఖపట్టణం, ఏప్రిల్ 17, 
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ పరువు తీసేలా ఉందని టీడీపీ అధినాయకత్వం అభిప్రాయపడింది. నిన్న గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. "ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి" అంటూ ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ పై టీడీపీ అధినాయకత్వం గుర్రుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సొంత పార్టీపై ఇలాంటి ట్వీట్లు చేయడం ఏంటని టీడీపీ నాయకత్వం ప్రశ్నిస్తుంది. ఇలా చేయడం పార్టీతో పాటు ప్రభుత్వం పరువు కూడా తీసినట్లవుతుందని అభిప్రాయపడింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే పౌర విమానయానశాఖ మంత్రి కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లోనైనా ఈ విషయాలు మాట్లాడాలి. లేకుంటే నేరుగా తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లాలి. అంతే తప్పించి ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువును బజారు కీడ్చటమేంటని టీడీపీ నాయకత్వం ప్రశ్నిస్తుంది. నిన్న గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ పై టీడీపీ నాయకత్వం వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసింది.కావాలనే గంటా శ్రీనివాసరావు ఈ ట్వీట్ చేసినట్లు అర్ధ మవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ టీడీపీ అధినాయకత్వం గంటా శ్రీనివాసరావుకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ట్వీట్ ను చూస్తుంటే కావాలని, ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టాన్న ప్రయత్నమే ఆయనలో కనపడుతుందని చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన ఈ ట్వీట్ మాత్రం పార్టీలో పెద్దయెత్తున చర్చకు దారితీసింది.

Related Posts