YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహిళలను రాణులుగా మారుస్తున్న ముద్ర..

మహిళలను రాణులుగా మారుస్తున్న ముద్ర..

హైదరాబాద్, ఏప్రిల్ 17, 
ఒక కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే ఆ కుటుంబం ఎంతో ఉన్నత స్థాయికి చేరుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కుటుంబంతోపాటు సమాజం, దేశం కూడా ప్రగతి నడుస్తాయి. మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగితే మరింత ప్రయోజనాలు కలుగుతాయి. ఆమె ఉన్నత స్థాయికి చేరడంతో పాటు ఆ పారిశ్రామిక రంగంలో ఉన్న మిగిలిన చాలామందికి కూడా ఉపాధి కలుగుతుంది. పొదుపుకు ప్రాధాన్యత లభిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల అభ్యున్నతి కోసం ఇప్పటివరకు ఎన్నో చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా ఎంతో మంది మహిళలకు ప్రోత్సాహం అందిస్తుంది. అప్పటి రోజులలో మహిళలు ఎక్కువగా కూలి పనుల మీద ఆధారపడి బతికే వాళ్ళు. చిన్న పరిశ్రమల స్థాపన అనేది అప్పటి వారికి తెలియని అంశంగా ఉండేది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడి అని చెప్పొచ్చు. అప్పట్లో తినడానికే తిండి లేక ఇబ్బంది పడే కుటుంబాలు పెట్టుబడిని ఎక్కడ నుంచి వస్తాయి. ఇటువంటి పరిస్థితిని పీఎంఎంవై చాలా సుమూలంగా మార్చిందని చెప్పొచ్చు.ఈ పథకం కింద మహిళలు రుణాలు పొంది టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పార్లల్స్, ఫుడ్ స్టాల్స్, అగ్రిపాసెసింగ్ యూనిట్స్ అలాగే దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఇది వారి జీవితంలో ఆర్థిక పరిస్థితులతో పాటు సమాజంలో వాళ్లకు గొప్ప మార్పును కూడా మెరుగుపరిచిందని చెప్పడంలో సందేహం లేదు. మహిళలు ఆర్థికంగా మెరుగుపడినప్పుడు వాళ్ళ పిల్లల చదువు మరియు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మహిళలు వాటికి ఖర్చు చేయగలిగితే వారి ఆర్థిక స్తోమత కూడా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో రాబోయే భవిష్యత్తు తరాలు ఉన్నతంగా ఎదుగుతాయి. ఈ విధంగా పీఎం ఎం వై సూక్ష్మ వ్యవస్థాపకులను ప్రోత్సహించడంతోపాటు సాధికారత మరియు ఆర్థికంగా చురుకైన మహిళలను తయారు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానమంత్రి ముద్ర యోజన రుణాలు తీసుకున్న వాళ్లలో సుమారు 68% వరకు మహిళలే ఉన్నారు.ఈ పథకం కింద రుణం తీసుకున్న మహిళలకు సిఏజిఆర్ 2016 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య 13 % గా ఉంటుంది. ఈ క్రమంలో మహిళల పొదుపులో 14% పెరిగాయి. ఈ పథకం కింద రుణాలను తీసుకోవడంతోపాటు వాటిని ఉపయోగించడం వలన జరిగిన ఆర్థిక ప్రగతిని కూడా ఇవి సూచిస్తున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం పీఎంఎంవై మెరుగైన ఫలితాలు సాధించిన క్రమంలో మహిళల సాధికారత మరియు ప్రగతి కోసం ప్రభుత్వం మరింత కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. అర్హులైన మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం అలాగే వ్యాపార విస్తరణకు అవకాశం కల్పించడం వంటివి చేయాల్సి ఉంది.

Related Posts