YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎంపీల్లో చామాల ఫస్ట్... రఘువీర్ లాస్ట్

ఎంపీల్లో చామాల ఫస్ట్... రఘువీర్ లాస్ట్

నల్గోండ, ఏప్రిల్ 17, 
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సమావేశాలు కీలకమైనవి. ఇవి చట్టాలను రూపొందించడానికి, ప్రభుత్వం జవాబుదారీతనాన్ని కలిగి ఉండటానికి, ప్రజల సమస్యలను చర్చించటానికి పార్లమెంట్ ముఖ్య వేదిక. పార్లమెంట్ సమావేశాలలో దేశంలోని ముఖ్యమైన సమస్యలు, సామాజిక అంశాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతర జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. దీని ద్వారా ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. పార్లమెంట్ సభ్యులు సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటంతో పాటు చట్టాలు రూపొందించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించడం వంటి ముఖ్యమైన విధులను నిర్వర్తించడం చాలా ముఖ్యం.తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు తెలంగాణ ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనటంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. జూన్ 2024 నుంచి 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజరయ్యారు.ఆ తర్వాత బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. మరో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చర్చల్లో టాప్‌లో ఉన్నారు. ఆయన 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ ఎంపీ రఘువీర్ అతి తక్కువ హాజరుతో పాటుగా.. తక్కువ ప్రశ్నలు, చర్చల్లో పాల్గొన్నారు.తెలంగాణ ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చలు ఇలా..
చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్): 79 ప్రశ్నలు, 100 శాతం హాజరు, 17 చర్చలు
రఘునందన్ రావు (బీజెపీ)- 46 ప్రశ్నలు, 97.05 శాతం హాజరు, 7 చర్చలు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి (బీజేపీ)- 18 ప్రశ్నలు, 95.58 శాతం హాజరు, 6 చర్చలు
అసదుద్దీన్ ఒవైసీ (AIMIM): 54 ప్రశ్నలు, 92.64 శాతం హాజరు, 21 చర్చలు
మల్లు రవి (కాంగ్రెస్): 28 ప్రశ్నలు, 92.64 శాతం హాజరు, 10 చర్చలు
గోడం నగేష్ (బీజేపీ)- 40 ప్రశ్నలు, 92.64 శాతం హాజరు, 4 చర్చలు
ఈటల రాజేందర్ (బీజేపీ) -80 ప్రశ్నలు 91.17 శాతం హాజరు, 9 చర్చలు
వంశీ కృష్ణ ( కాంగ్రెస్)- 31 ప్రశ్నలు, 89.70 శాతం హాజరు, 7 చర్చలు
డి.కె. అరుణ (బీజెపి)- 73 ప్రశ్నలు 88.23 శాతం హాజరు, 14 చర్చలు
అరవింద్ ధర్మపురి (బీజేపీ)- 59 ప్రశ్నలు, 88.23 శాతం హాజరు, 2 చర్చలు
సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) 62 ప్రశ్నలు, 86.76 శాతం హాజరు , 5 చర్చలు
రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్)- 56 ప్రశ్నలు, 85.29 శాతం హాజరు, 9 చర్చలు
కడియం కావ్య (కాంగ్రెస్)- 31 ప్రశ్నలు, 83.82 శాతం హాజరు, 5 చర్చలు
బలరాం నాయక్ (కాంగ్రెస్)- 13 ప్రశ్నలు, 72.05 శాతం హాజరు, 3 చర్చలు
కుందూరు రఘువీర్ (కాంగ్రెస్)- 8 ప్రశ్నలు, 72.05 శాతం హాజరు, 0 చర్చలు

Related Posts