కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న సర్వే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన యువ బృందాలను ప్రతిపక్ష పార్టీయే ప్రయోగించిందన్న అనుమానాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీయే సర్వే జరిపిస్తున్నదన్న ప్రచారమూ నడుస్తోంది. కుప్పంలో జరుగుతున్న సర్వే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాలతోపాటు, స్థానిక నాయకుల పనితీరు, ఓట్ల సరళి గురించి కూడా వివరాలు అడుగుతున్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన యువ బృందాలను ప్రతిపక్ష పార్టీయే ప్రయోగించిందన్న అనుమానాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ సర్వే జరపడం ద్వారా తప్పుడు సమాచారాన్ని సేకరించి ఎన్నికల నాటికి అధికార పార్టీకి అప్రదిష్ట తెస్తుందంటూ వాట్సప్ గ్రూపుల్లో ఆ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ఉద్రిక్తతలు సైతం తలెత్తుతు న్నాయి. మరోవైపు అధికార పార్టీయే ఈ సర్వే జరిపిస్తున్న దన్న ప్రచారమూ జరుగుతోంది.
ఎన్నికలకింకా ఏడాది దాకా సమయముంది కానీ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునందు కుని ఊరూవాడా నవ నిర్మాణ దీక్షలు నడుస్తుండగా, ఆ పార్టీ నాయకులు వేదికలనెక్కి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాన్ని టార్గెట్ చేసుకుని, ఆ పార్టీకి వైసీపీ అంట కాగుతున్నదంటూ విమ ర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ శ్రేణులు సైతం పాద యాత్రలంటూ పల్లెలు చుట్టేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గమైన కుప్పంలో సైతం ఇదే పరిస్థి తులు నడుస్తున్నాయి.
నాలుగు మండలాల్లో పంచాయతీల వారీగా అధికా రులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు నవ నిర్మాణ దీక్షా సభలను జోరుగా నిర్వహిస్తున్నారు. జనాలను పెద్దయెత్తున సమీకరించి రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షే మానికి ముఖ్యమంత్రి అమలు చేస్తున్న వివిధ పథ కాలను వివరిస్తున్నారు. గ్రామాలలో పర్యటిస్తూ జనాలలో ప్రభుత్వంపై సానుకూలతను, వారి సంతృప్త స్థాయిని పెంచడానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ చంద్రమౌళి కూడా తనకు చేత నైనంతగా గ్రామాలలో పాదయాత్ర పేరుతో పర్యటనలు జరుపుతున్నారు.
నియోజకవర్గంలో ఎటు చూసినా ఎన్నికలిప్పుడే వచ్చేస్తున్నాయా అన్నంతగా ప్రచారపర్వం, నాయకుల హంగామా కనిపిస్తోంది. ఈ సమయంలో.. పదీ పదిహేను రోజుల క్రితం కొందరు యువకులతో కూడిన బృందాలు నియోజకవర్గంలో దిగి పోయాయి. ట్యాబ్‌లు భుజాలకు తగిలించుకుని పల్లెబాట పట్టాయి. నాలుగు మండలాల్లోనూ ఈ బృందాలు సర్వే చేస్తున్నాయి. ఇంటిం టికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. వ్యక్తిగత, గ్రామ సమస్యలపై పది ప్రశ్నలు అడిగి జనం నుంచి వివరాలు రాబట్టి అప్‌లోడ్ చేస్తు న్నాయి. అంతేకాక ఎమ్మెల్యే, సీఎం పనితీరు, స్థానిక నాయకత్వం వ్యవహారశైలి, సీఎం ఎవరైతే బాగుంటుంది తదితర ప్రశ్నలన్నింటినీ అడిగి మరీ ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తు న్నాయి. పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున యువకులు సర్వే చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి రూపాయల వంతున సంబంధిత ఏజన్సీ చెల్లిస్తోందని తెలిసింది. అసలే రాజకీయ హడావుడి ప్రారంభమైన నేపథ్యంలో ఈ సర్వేలు నియోజకవర్గంలో కొద్దిపాటి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి.
సర్వే బృందాల్లోని కొందరు యువకులు ఇళ్లకు వెళ్లి దౌర్జన్యకరమైన రీతితో ప్రశ్నలు వేయడంతో గ్రామాల్లో జనం తిరగబడుతున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ ఈ సర్వే చేయిస్తున్నదన్న ప్రచారం జరుగుతుండడంతో అధికార పార్టీలోని కార్య కర్తలు అప్రమత్తమవుతున్నారు. సర్వే బృందాలకు సహకరించరాదంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పోస్ట్ అవుతున్నాయి. సర్వే పేరుతో ముఖ్య మంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీకి అప్రదిష్ట తేవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తున్నదంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.