YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమాత్య... యోగం ఎప్పుడు

అమాత్య... యోగం ఎప్పుడు

విజయవాడ,, ఏప్రిల్ 19, 
జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి అందనంత దూరంలోనే ఉంది. ఆయనకు అస్సలు మంత్రి పదవి వస్తుందా? రాదా? అన్నది అనుమానం ఇప్పుడు అందరిలోనూ బయలుదేరింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందని, పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని పవన్ కల్యాణ్ బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారెవరైనా సరే పదవులు వస్తాయని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పిన దాని ప్రకారం ఉగాది నాటికే నాగబాబు మంత్రి పదవి లభిస్తుందని చెప్పారు. అయితే ఉగాది వెళ్లిపోయినా ఇప్పటి వరకూ నాగబాబు మంత్రి పదవిపై ఊసే లేదు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి సింగపూర్ లో ప్రమాదం జరగడం, తర్వాత ఆయన వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో పాటు కొన్ని సమస్యలతో నాగబాబు మంత్రి పదవి మరికొన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిసింది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి పదిహేడో తేదీ నుంచి ఐదు రోజుల పాటు యూరప్ పర్యటనలో ఉంటారు. చంద్రబాబు తన 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు వెళుతున్నారు. దీంతో పాటు వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ పర్యటన అమరావతిలో ఉండనుంది. అంటే మే మొదటి వారం వరకూ నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచన చేసే అవకాశం ఉండకపోవచ్చు.  నాగబాబును పిఠాపురం నియోజకవర్గానికి పంపిన పవన్ కల్యాణ్ అక్కడ పరిస్థితులను చక్కబెట్టాలని భావిస్తున్నారని తెలిసింది. మంత్రి పదవిలో ఉంటే పిఠాపురంలో మరింతగా రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచన కూడా పవన్ చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా ఉండి పిఠాపురంలో అన్నీ చక్కబెట్టేందుకు నాగబాబు సేవలను ఉపయోగించుకుంటే మంచిదని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు కూడాచెబుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కూడా మంత్రి పదవి విషయంలో చంద్రబాబు వద్ద పట్టుబట్టడం లేదని, నిజంగా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వెంటనే చంద్రబాబుతో మాట్లాడి గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకుని ప్రమాణ స్వీకారం చేయించేవారంటున్నారు.. కుటుంబంలో ఇద్దం మంత్రివర్గంలో ఉంటే పార్టీని బలోపేతం చేయడం కుదరదని కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే నాగబాబుకు పిఠాపురం బాధ్యతలను అప్పగించి తాను జిల్లాల పర్యటనలు చేయించాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఏమాత్రం పవన్ కల్యాణ్ కు ఆలోచన ఉన్నా వెంటనే మంత్రి పదవి విషయం చంద్రబాబు వద్ద ప్రస్తావించే వారంటున్నారు. దీంతో పాటు ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరిపితే చంద్రబాబుకు కూడా తలనొప్పిగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్లేనన్న ప్రచారం మాత్రం జనసేన లో బాగా వినపడుతుంది.

Related Posts