YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల గోశాలలో ఏం జరుగుతోంది..

తిరుమల గోశాలలో ఏం జరుగుతోంది..

తిరుమల, ఏప్రిల్ 19, 
తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సమ్రక్షణశాల చుట్టూ రాజకీయ వివాదం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. వైసీపీ నాయకుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..గత 3నెలల్లో టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే గోవుల మరణాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.గోశాల నిర్వహణలో లోపాలు, గోవులకు సరైన ఆహారం, వైద్య సంరక్షణ లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని భూమన ఆరోపించారు. అంతేకాక, గోశాల నిర్వహణ బాధ్యతలు అనుభవంలేని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు అప్పగించారని విమర్శించారు. అయితే భూమున కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ వాటిని తోసిపుచ్చింది.గోశాలలో 100 గోవులు చనిపోయాయనే వాదనలను ఫేక్ న్యూస్ గా అభివర్ణించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చనిపోయిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. అసలు భూమన ఈ విషయం ఎందుకు బయటకు చెప్పారనే దానిపై బీఆర్ నాయుడు వివరిస్తూ సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమున ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ వివాదం నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, బోర్డు సభ్యుడు జి. భాను ప్రకాష్ రెడ్డి గోశాలను సందర్శించి, గోవులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గత మూడు నెలల్లో 40-43 గోవులు వృద్ధాప్యం, వ్యాధుల కారణంగా మరణించాయని..ఇది సహజమైనదని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.అయితే ఈవో చెప్పిన గోవుల సంఖ్యపై భూమన మరోసారి సందేహం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులు, ఛైర్మన్, సీఎం చంద్రబాబు ఇచ్చిన సమాచారం వైరుధ్యంగా ఉందని విమర్శించారు. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భూమన కూటమి ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు.అసలు హరినాథ్ రెడ్డి అన్నింటికి తెగించి భూమనకు సమాచారం ఇవ్వడం, దాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ చేయడంతో విస్త్రతంగా ప్రచారం చేయడం వెనుక అనేక ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకాగానే టీటీడీని సమూళంగా ప్రక్షాళన చేయాలని భావించి వెంటనే చర్యలు చేపట్టింది.అందులో భాగంగా శ్రీవారి గోశాలపై విజిలెన్స్ విచారణ జరిపించింది. దీంతో నివేదిక బయటకు వచ్చింది. టీటీడీలో జరిగిన అక్రమాలను వెలికి తీయడంతో పాటు భవిష్యత్ లో అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా విజిలెన్స్ నివేదిక బయటకు రాబోతుందని తెలిసిన వెంటనే వైసీపీ నేతలు ముందుగా గోశాలపై ఆరోపణలు చేయడం ప్రారంభించారంట. 100 ఆవులు చనిపోయినట్లు ప్రచారానికి తెరతీశారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇలాంటి పోస్టులతోనే నిండిపోయిందట.గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన దారుణాలు ఎక్కడ బయట పడతాయో అన్న భయంతో ముందుగానే రోడ్డెక్కి నిందలు వేస్తున్న వైసీపీ నేతల ప్రయత్నాల్లో భాగంగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి సర్కార్ పై లేనిపోని నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ నేరాలు ఘోరాలు జరిగాయని…అవన్నీ కూటమి సర్కార్ పై రుద్దే ప్రయత్నం భూమన చేస్తున్నాడని మండిపడుతున్నారంట.వైసీపీ హయాంలో చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ అవినీతి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడిందట. అంతేకాదు గోవులకు నాసిరకం దాణా, కాలం చెల్లిన మందులు ఇచ్చి నోరులేని మూగజీవాల ప్రాణాలను బలిగొన్నట్లు రిపోర్టులో ఉందట. ఇవన్నీ ఎక్కడ బయటపడి తమ మెడకు చుట్టుకుంటాయో అన్న అనుమానంతోనే భూమన ఫేక్ ఫోటోలతో టీటీడీ ప్రతిష్టే కాదు..కూటమి సర్కార్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అంతా టాక్ విన్పిస్తోంది. మరి గోశాల వివాదం ఇంతటితో ఆగిపోతుందా..మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి.

Related Posts