YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాదాద్రి జిల్లా లో రైతుల కష్టాలు

యాదాద్రి జిల్లా లో రైతుల కష్టాలు

యాదాద్రి
యాదాద్రి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతులు కళ్లముందు తమ ధాన్యం తడిసి ముద్దవుతుంటే నిస్సహాయంగా చూస్తున్నారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం వారి ఆశలను నీరుగార్చింది.
అష్ట కష్టాలు  పడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న సమయంలో ఈ అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఐకేపీ, పీఏసిఎస్  సెంటర్ లు,మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం కుప్పలపై కప్పిన పట్టాలు బలమైన గాలులకు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు నష్టం వాటిల్లకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు
17 శాతం తేమ ఉండేలా వారం రోజుల నుండి కష్టపడి ఎండ పెడితే అకాల వర్షం రైతులను నిండా ముంచింది.. ఈదురు గాలులు,ఉరుములు మెరుపులు లతో వర్షం బీబత్సం సృష్టిస్తుంది..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లైట్లు లేక, గాలికి పట్టాలు కొట్టుకు పోయి, కారు చీకట్లో పాములు, తేల్లు వర్షపు నీటిలో కొట్టుకు ని ధాన్యం రాసుల్లోకి వస్తున్నా తడిసిన ధాన్యం కల్లా ల లో మహిళా రైతులు సహితం  తడిసిన బట్టలతో ప్రాణాలు అరి చేతిలో పెట్టికుని తమ ధాన్యం తడిసి పోతుందనే బాధతోనే ఐకేపి, పిఎసి ఎస్ కేంద్రాల్లోనే బిక్కు బిక్కుమనుకుంటూ అక్కడే ఉన్నారు.. ఎవరికి చెప్పుకోవాలో కుడా తెలియడం లేదంటూ మనో వేదన పడుతున్నారు....

Related Posts