YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కార్తీ "చినబాబు" ఆడియో జూన్ 23, సినిమా జులై 13న విడుదల.

 కార్తీ "చినబాబు" ఆడియో జూన్ 23, సినిమా జులై 13న విడుదల.
కార్తీ నటించిన "చినబాబు" సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చెయ్యబోతున్నారు. జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన "చినబాబు" టీజర్ కు మంచి స్పందన లభించింది. జూన్ 23న జరగబోయే "చినబాబు" ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తీ, సూర్య పాల్గొనబోతున్నారు.
నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

Related Posts