
వరంగల్, ఏప్రిల్ 19,
కొండా సురేఖ.. మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడే వీడియో వైరల్ అవుతోంది. సెక్రటేరియట్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ పేషీలో సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ ముగిశాక.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఆవిడ జరిపిన సంభాషణ.. హాట్ టాపిక్‌గా మారింది.మంత్రి మాట్లాడిన అంశంపైనే ఇప్పుడు వివాదమంతా. తన బంధువు బిడ్డ కోసం.. ఓ ఉద్యోగం ఉంటే చూడాలంటూ.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. ఈ పైరవీ సీన్ అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర మంత్రి.. ఉద్యోగం చూడాలని కోరడం, సరే చేద్దాం.. ఇప్పిస్తానంటూ ఆ మంత్రి కూడా బదులివ్వడంపై.. సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది.తన అన్నయ్య మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. ఆయన కూడా సరే అంటూ హామీ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఇదంతా క్యాజువల్‌గా జరిగి ఉంటే ఎలాంటి వివాదం లేదు. ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్యలోనే ఉండిపోయేది. బయటకు తెలియకపోయేది. కానీ.. ఈ సీన్ అంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవడం, ఆ క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాదంగా మారింది.ప్రెస్‌మీట్ అవగానే.. మంత్రులు మాట్లాడుకున్నారు. అక్కడ కెమెరాలున్నాయనే కనీస అవగాహన కూడా లేకుండా.. మంత్రి తన బంధువులకు ఉద్యోగం కావాలి.. అందుకు మీ రికమండేషన్ కావాలని అడగడంపై.. సోషల్ మీడియా యూజర్లంతా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కూడా ఉద్యోగాలు కావాలని, మంత్రులు సిఫారసు చేయాలని కామెంట్స్ చేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా.. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట.ఆ మధ్య.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తీవ్ర దుమారం రేపాయ్. ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని.. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఈ క్రమంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, వివరణ అడగడం కూడా జరిగింది. అప్పుడే.. ఆవిడను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయ్. చివరకు.. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఇంకా.. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది.
ఈ ఇష్యూ.. కొండా సురేఖకు తలనొప్పిగా మారిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇదే సమయంలో మంత్రిగారి వ్యవహారం వివాదాస్పదంగా మారడం ఇప్పుడు కొత్తేమీ కాదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. గతంలో ఆవిడ మాట్లాడిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు తాగినంత మద్యం అంటూ చెప్పిన సెల్ఫీ వీడియో కాల్ కూడా వైరల్ అయింది. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవడం పరిపాటిగా మారుతోందనే చర్చ పార్టీలో నడుస్తోందట.ఆమె వ్యవహారశైలి పదే పదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండటంతో.. కొండా సురేఖ గ్రాఫ్ కూడా పడిపోతోందనే చర్చ సాగుతోంది. ఆవిడ పనితీరు కూడా బాగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే.. పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన మంత్రి కొండా సురేఖ.. ఇకపై కొంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.