
హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంపై ఎంపి అసదుద్దిన్ ఓవైసీ సభ పెడుతున్నాడు. ఓవైసీ ఈ సభలోనైనా నిజం చెప్పే ప్రయత్నం చెయ్. నిజం చెప్పడానికి నీవు ఒప్పుకోవని అయన అన్నారు. ఎందుకంటే వక్ఫ్ భూములను కబ్జా చేసింది అమ్ముకున్నది, తక్కువ ధరకు లీజుకు ఇచ్చింది మీరే. వాటిని అమ్ముకున్నప్పుడు మీకు అవి అల్లా భూములని గుర్తు రాలేదా..? ముస్లింల్లారా ఓవైసీ మాటలను నమ్మకండి.. నమ్మితే మీరే నష్టపోతారు. వక్ఫ్ చట్టం వలన పేద ముస్లింలకు మంచి జరుగుతుంది. మీరు ఎన్ని చేసిన వక్ఫ్ చట్టం పైన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. పార్లమెంట్లో వక్ఫ్ చట్టం పైన మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. కానీ ఓవైసీ కి మాట్లాడే దమ్ము లేక మీడియాలో హైలైట్ కావాలని చట్టాన్ని చించి వచ్చారు. వక్ఫ్ బిల్లు మంచా చెడా అనేది ముస్లింలందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.