YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు నీరా కిశోర్ డిమాండ్

తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే  భర్తీ  చేయాలి      తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు నీరా కిశోర్ డిమాండ్
ఉద్యోగాల భర్తీ విషయంలో తాత్సారం చేస్తూ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసి లబ్ధి పొందేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు నీరా కిశోర్.  ఉద్య‌మ స‌మ‌యంలో అయితే ఏకంగా తెలంగాణ‌లో 1,68,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని టీఆర్ఎస్ పార్టీ నేత‌లే అన్నారు. వీటిని భ‌ర్తీ చేయాలంటూ ఆనాడు అనేక సంద‌ర్భాల్లో డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేత‌లు. ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. విద్యార్థులతో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ర్యాలీలు, ధ‌ర్నాలు చేప‌ట్టారనే విషయాన్ని గుర్తు చేశారు నీరా కిశోర్. అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 1,12,400 పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు 4 ఏళ్లు ద‌గ్గ‌ర ప‌డుతున్న ఇప్ప‌టి వ‌ర‌కు 4వ వంతు ఉద్యోగాల‌ను కూడా భ‌ర్తీ చేప‌ట్ట‌లేక‌పోయిందని ఆరోపించారు నీరా కిశోర్.  వేగంగా ఉద్యోగాలను నింప‌కుండా కావాల‌నే నోటిఫికేష‌న్ల పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేస్తోంది స‌ర్కార్ అని అన్నారు.     ఫ‌లితంగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక... కుటుంబాలు గ‌డ‌వ‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రైవేటు సెక్ట‌ర్ లో కూడా అర్హ‌త‌కు త‌గిన‌ ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు చెప్పారు.  సీఎం కేసీఆర్ చెప్పిన ఒక ల‌క్ష 12 వేల ఉద్యోగాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ డిపార్ట్ మెంట్ల వారిగా  21,473 పోస్టులను భ‌ర్తీ చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ ప్ర‌భుత్వం నిరుద్యోగుల విష‌యంలో ఎంత నిర్ల‌క్ష్యం చేస్తోందో అర్థ‌మ‌వుతోందన్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల నోటిఫికేష‌న్ల‌ను ఇస్తోంది... త‌ప్ప చిత్త శుద్ధితో వాటిని భ‌ర్తీ చేయాల‌ని చూడ‌టం లేదు.   నియ‌మాకాలు చేప‌ట్టాల్సిన ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోర‌ణితో వ్య‌వ‌హారించ‌డం దారుణమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఉద్యోగాల నియ‌మాకం చేయ‌డం లేద‌ని ఆందోళ‌న చేసిన టీఆర్ఎస్ నేత‌లు ఇప్ప‌డు ఉద్యోగాల నియ‌మాకాల విష‌యంలో త‌త్సారం చేయ‌డం వెనుక అంత‌ర్య‌మేమిటి అని ప్రశ్నించారు.  టీఎస్ పీఎస్సీ ద్వారా వివిధ డిపార్ట్ మెంట్ ల ద్వారా 11,086 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది.  న్యాయ నిపుణుల స‌ల‌హాలు లేకుండా 8,792 టీచ‌ర్ పోస్టుల‌కు టీఆర్టీ నోటిఫికేష‌న్ ఇచ్చింది స‌ర్కార్. దీనిపై కోర్టు సీరియ‌స్ కావ‌డంతో మ‌ళ్లీ పాత జిల్లాల ప్ర‌తిపాదికన నోటిఫికేష‌న్ ఇచ్చి... ఉద్యోగాల భ‌ర్తీని జాప్యం చేస్తోంది ప్రభుత్వం అని చెప్పారు. ఎందుకు కొత్త జిల్లాల పేరుతో ఈ నోటిఫికేష‌న్ ఇచ్చింది మీరు అర్థం చేసుకోవ‌చ్చు తెలిపారు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు నీరా కిశోర్.  నిజంగా ప్ర‌భుత్వానికి టీచ‌ర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఉంటే ఇలా బాధ్య‌త ర‌హిత్యంగా నోటిఫికేష‌న్ ఇస్తుందా? అని ప్ర‌శ్నిస్తున్నన్నారు. ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న వేల 18 వేల 428 పోలీసు ఉద్యోగాల‌కు, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం అంటే ఓట్ల రాజ‌కీయం కాక‌పోతే ఏంటీ? అని ప్రశ్నించారు. 4 ఏళ్లుగా నిరుద్యోగుల రోద‌న‌ను ప‌ట్టించుకోకుండా ఇప్ప‌డు నోటిఫికేష‌న్ల పేరుతో ఓట్ల ఏర వేస్తోంది కేసీఆర్ ప్ర‌భుత్వమన్నారు. ప్ర‌భుతానికి చిత్తశుద్ధి లేక‌పోడం వ‌ల్లే ఏళ్లు గ‌డిస్తున్న ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వం కావాల‌నే ఉద్యోగాల భ‌ర్తీకి విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు నీరా కిశోర్. ప్రజ‌లు, విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్నారు... రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి త‌గిన గుణ‌పాఠం చెబుతారని అన్నారు.

Related Posts