YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మకానికి విశాఖ

అమ్మకానికి విశాఖ

విశాఖపట్టణం, ఏప్రిల్ 22, 
విశాఖ భూములంటే బంగారం. గోల్డ్ కంటే ఎంతో విలువైనవి. ఎందుకంటే విశాఖ అంటే నగరం కాదు.. అన్ని రాష్ట్రాల సంస్కృతలకు నిలయమైన సిటీ. ఇప్పుడే కాదు విశాఖలో 1990వ దశకం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండేది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలతో పాటు నేవీ, సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపై ఏపీ వాసుల కన్ను పడింది అనేక మంది అక్కడకు వెళ్లి సెటలయి కోట్ల రూపాయలను ఆర్జించారు. మత్స్యకారులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కావడంతో వారిని సులువుగా తమ బుట్టలో వేసుకోవడం సాధ్యమయిందని ఎవరైనా ఒప్పుకుంటారు. కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వెళ్లిన తర్వాతే విశాఖలో ఒకరకమైన వాతావరణం నెలకొందన్న వాదనలో నిజం లేకపోలేదు.. అయితే ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకంటే.. కొన్ని దశాబ్దాలుగా విశాఖ నగరం విస్తరించింది. ఇప్పటికే విశాఖ, విజయనగరం దాదాపు కలసిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కాబినెట్ కారు చౌకగా ఒక ఊరు పేరు తెలియని సంస్థకు 59 రూపాయలకే అరవై ఎకరాల వరకూ కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ది వైర్ పరిశోధాత్మక కథనంలోనూ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ అని చెప్పుకునే ఉర్సు కంపెనీ 2025లోనే రిజిస్టర్ అయిందని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. దీనిపై విశాఖలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలను స్థాపించుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు. అంతే తప్ప ఏకంగా భూములను కట్టబెట్టడమేంటన్న ప్రశ్న తలెత్తుంది. నిజానికి ప్రభుత్వమే హైటెక్ సిటీ లేదా మైండ్ స్సేస్ వంటి నిర్మాణాలు చేపట్టి నామమాత్రపు అద్దెకు లీజుకు ఇచ్చి ప్రోత్సహించవచ్చు. అంతే తప్పించి ఇలా భూములను విక్రయించుకుంటూ పోతే ఎలా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. అసలు ఉర్సా అనే కంపెనీ పుట్టుకను వింటనే ఆశ్చర్యమేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్టర్ అయిన కంపెనీ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది? అదేమైనా కార్పొరేట్ కంపెనీయా అంటే అదీ కాకపోయె. ఉర్సా అనే పేరు కూడా వినని కంపెనీకి కాపులుప్పలపాడులో 56 ఎకరాలు, టీసీఎస్ కు ఇచ్చిన చోట3.6 ఎకరాలు కేటాయించింది. ఉర్సా క్లస్టర్ కంపెనీకి అప్పనంగా భూముల కేటాయించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇద్దరు డైరెక్టర్లతో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం పది లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైందని ది వైర్ ఇన్విస్టిగేషన్ లో వెల్లడయింది. అంతేకాదు ఇందులో ఇద్దరు డైరెక్టర్లు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ వారు ఇక్కడ ఐటీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చారని ది వైర్ కథనం వెల్లడించింది.. కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కార్యాలయం కూడా లేదని తెలిసింది. కేవలం ఏదో ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి భూములను కారు చౌకగా కొట్టేశారంటున్నారు. కనీసం కంపెనీకి ఫోన్ నెంబరు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీం ఇంటి అడ్రస్ కూడా లేకపోవడం సందేహాలకు కారణంగా మారింది. రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ పెట్టి స్థలాలను విశాఖలో తీసుకునేందుకు ప్లాన్ చేశారని ది వైర్ కథనం ప్రచురించింది. ఈ కంపెనీ వయసు కేవలం రెండు నెలలు మాత్రమే. ఏపీ, తెలంగాణలలో ఇప్పటి వరకూ ఎలాంటి ఐటీ కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవని తేలింది. అయితే ఇదేకంపెనీ తెలంగాణ ప్రభుత్వంతోనూ ఐదు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉర్సా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూమి విలువ వెయ్యికోట్లకుపైగానే ఉంటుందనిచెబుతున్నారు.ఇదే సమయంలో 2,500 మందికి మాత్రమే ఉపాధిఅవకాశాలు ఇవ్వనుందని కూడా ప్రభుత్వం చెబుతుంది.

Related Posts