
విజయవాడ, ఏప్రిల్ 22,
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల వనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.ఏపీలో రాజకీయంఆసక్తిగా మారుతోంది. కూటమి పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. మూడు పార్టీలు కలిసి నడుస్తూనే.. ఎవరికి వారిగా బలపడాలని చూస్తున్నాయి. మరోవైపు బిజెపి ఏపీ నుంచి జాతీయస్థాయిలో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనుంది. ఇంతలో ఏపీకి మరో కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తోంది. అయితే అది ఆ రెండు పార్టీలకు కాకుండా.. తమ పార్టీ ఎంపీకి ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన ఢిల్లీ చేరుకొనున్నారు.రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల వనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే హోం మంత్రి అమిత్ షా తో భేటీ మాత్రం రాజకీయ అంశాల కోసమేనని చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతున్న సమయంలో.. దాని గురించి చర్చించేందుకే చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు భర్తీకి.. ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీటు బిజెపి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఈ రాజ్యసభ సీటును దక్కించుకొని.. కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.అయితే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ పదవికి విపరీతమైన పోటీ ఉంది. కానీ అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకు అవకాశం ఇస్తారని బిజెపి వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థితో పాటుగా కేంద్రమంత్రిగా అవకాశం ఎవరికీ ఇవ్వాలనే అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రకరకాల చర్చ నడుస్తోంది. అయితే త్వరలో ప్రధాని ఏపీ పర్యటన దృష్ట్యా.. సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.ఇప్పటికే ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోముగ్గురికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. బిజెపి నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన నుంచి ఎవరికి చోటు దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తారని ఇప్పటివరకు ప్రచారం నడిచింది. అయితే తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటన వచ్చింది. ఈ తరుణంలో అన్నామలైకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇచ్చి.. రాజకీయంగా మరింత ప్రోత్సాహం అందించే అవకాశం ఉంది. మరి ఇంకా ఏం జరుగుతుందో? ఎలాంటి నిర్ణయాలు వస్తాయో? చూడాలి మరి.