
కొడిమ్యాల,
ఎండ కాలం రాగానే తాటి మంజలు మనకు రోడ్లపై దర్శనమిస్తాయి. గీత కార్మికులు తాటి ముంజలను కోసి అక్కడక్కడా అమ్ముతుంటారు ఇవి ఎండాకాలం లో చలువకు మంచిగా పనిచేస్తాయి. విటమిన్ బి, జింక్, పాస్ పారస్, కాల్షియం ఉంటుంది. ఎండాకాలంలో మనం ఎంత నీళ్లు తాగిన సరిపోవు తాటిముంజలు తింటే ఉప శమనం పొందవచ్చు. కాన్సర్, ట్యూమర్స్ లాంటివి కూడ వీటినుండి ఉపశమనం లభిస్తుంది.గర్భిణీ స్త్రీలకు ఇవి కాల్షియంఐరన్ ను అందిస్తాయి. తాటి ముంజలను తింటే బరువు తగ్గిస్తుంది. కాలేయంలో విష పదార్థాలను తీసేస్తుంది. ఎండాకాలంలో బయటకు వెళితే తొందరగా అలసిపోతాం కాబట్టి ముంజలను తింటే అలసట దూరమవుతుంది.వీటిని పొట్టు తీయకుండా తింటేనేమంచిది పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి.ఏవైనా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది తాటి ముంజలను ఐస్ ఆపిల్ కూడ అంటారు.