
హైదరాబాద్, ఏప్రిల్ 22,
ఈ మధ్య తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా కొందరు పురుషులు వారి భార్యలకు బలయ్యారు. అయితే భార్యల చేతిలో.. లేకపోతే కాంట్రాక్ట్ కిల్లర్స్ చేతిలో భర్తలు చనిపోయారు. కొందరు ప్రాణాలతో భయటపడి.. పోలీసులను అశ్రయించారు. అయితే.. అసలు భార్యాభర్తలు చంపుకునే వరకు ఎందుకు వెళ్తున్నారు. 10 ముఖ్యమైన అంశాలు..అక్రమ సంబంధాలు.. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడటం, ఆ సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో అతన్ని చంపడానికి ప్రేరేపించవచ్చు. ఇటీవల వరంగల్‌లో వైద్యుడిపై దాడి, అతను చనిపోవడం ఇందుకు ఉదాహరణ. గృహ హింస.. భర్త నుండి భార్య నిరంతరం శారీరక, మానసిక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటుంటే.. విసిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఆమె భర్తను చంపే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు.. తీవ్రమైన ఆర్థికఇబ్బందులు, భర్త బాధ్యతారాహిత్యం లేదా ఇతర ఆర్థిక కారణాల వల్ల భార్య భర్తను చంపడానికి పాల్పడవచ్చు.వంశపారంపర్య వివాదాలు.. కుటుంబ ఆస్తులు లేదా ఇతర వంశపారంపర్య విషయాలలో తలెత్తే ఘర్షణలు హత్యకు దారితీయవచ్చు. ఇందుకు ఉదాహరణ.. కర్ణాటక మాజీ డీజీపీ ఉదంతం.మానసిక సమస్యలు.. భార్య తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతుంటే.. ఆమె ఏమి చేస్తుందో తెలియని స్థితిలో భర్తను చంపే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు ఏపీలో కొన్ని జరిగాయి.ఆస్తి, డబ్బు.. భర్త ఆస్తిని లేదా డబ్బును పొందాలనే దురుద్దేశంతో భార్య అతన్ని చంపవచ్చు. గతేడాది హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని అతని భార్య వేరే సాయంతో కర్ణాటకలో హత్య చేసింది. డబ్బులు కోసం చంపినట్టు విచారణలో వెల్లడైంది.దూషణ, వేధింపులు.. భర్త నిరంతరం దూషించడం, అవమానించడం లేదా వేధించడం వంటి కారణాల వల్ల భార్య తీవ్రమైన ఆగ్రహానికి లోనై హత్య చేయవచ్చు.బలవంతపు వివాహం.. ఇష్టంలేని వ్యక్తితో బలవంతంగా వివాహం చేయడం వల్ల ఏర్పడే అసంతృప్తి, ద్వేషం హత్యకు దారితీయవచ్చు. అప్పుడు పెళ్లి చేసుకున్న యువతి లేదా మహిళ.. తన భర్తను చంపేవరకు వెళ్లవచ్చు. ఇలాంటి ఘటనలు కూడా గతంలో జరిగాయి.ఇటీవలి కొన్ని సంఘటనలు ఈ సమస్య యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి, అతని శరీరాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్‌లో దాచిపెట్టింది.వివాహం జరిగిన రెండు వారాలకే ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించింది. ఇలాంటి సంఘటనలు భార్యలు భర్తలను చంపడానికి గల సంక్లిష్టమైన కారణాలను వెలుగులోకి తెస్తున్నాయి.