
హైదరాబాద్/విజయవాడ
ఆంధ్ర, తెలంగాణలో నేటి నుంచి 3రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశలున్నట్లు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 42-44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావొచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచించారు.