YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కళకళలాడుతున్న నైట్ బజార్

కళకళలాడుతున్న నైట్ బజార్
రంజాన్‌ మాసంలో హైదరాబాద్‌ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. హైదరాబాద్‌ అనగానే మనకు గుర్తొచ్చే చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి మనకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగే రాత్‌ బజార్‌కి ఒక ప్రత్యేకత ఉంది... ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.హైదరాబద్‌ అనగానే మనకు గుర్తొచ్చేవి చారిత్రాత్మక కట్టడాలు..  వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది చార్మినార్‌ గురించి. హైదరాబాద్‌ వచ్చిన పర్యాటకులు చార్మినార్‌ను చూడకుండా వెళ్లరు.. నిత్యం పర్యాటకులతో కోలాహలంగా ఉండే చార్మినార్‌ ప్రాంతం.. రంజాన్‌ మాసంలో మరింత శోభాయమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జరిగే రాత్‌ బజార్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన రాష్ట్రాల నుంచే కాకుండా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు రంజాన్‌ మాసంలో ఒక్కసారన్న రాత్‌ బజార్‌ని చూడాలని వస్తుంటారు... చేతి గాజుల నుంచి మన ధరించే దుస్తుల వరకు, అత్తరు నుంచి ఆభరణాల వరకు... పిల్లలకు, పెద్దలకు అని తేడా లేకుండా అందరికీ అన్నీ దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు..చార్మినార్‌ అనగానే మనకు గుర్తొచ్చే వస్తువు గాజులు... హైదరాబాద్‌ మొత్తానికి చార్మినార్‌ ప్రత్యేకమైతే... రాత్‌ బజార్‌కి మాత్రం లాడ్‌ బజారులోని రంగు రంగుల గాజులు స్పెషల్‌ అట్రాక్షన్‌.. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఈ గాజులకు మంచి క్రేజ్‌ ఉంది. తలతలా మెరిస్తూ, రంగు రంగుల డిజైన్లలలో అతివలను అమితంగా ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా నైట్ బజార్‌ వేళ దేశ విదేశాల నుంచి ఢిపరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ మోడల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.చార్మినార్‌ ప్రాంతంలో నైట్ పాపింగ్ చేయడం ఒక సంప్రదాయంగా చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ నైట్ మార్కెట్లో షాపింగ్ చేయడం ఒక్క ముస్లింలకే కాదు అన్ని మతాల వారి చాలా ఇష్టమైనదిగా భావిస్తారు. ఒక విధంగా ఇదో మత సామరస్య మార్కెట్. రాత్ బజార్లో దొరకని వస్తువుండదంటే అతిశయోక్తి కాదు. చెప్పులు, బ్యాగులు, గాజులు, వస్త్రాలు,అత్తర్‌ ఇలా అనేక వస్తువులతో పాటు ఒన్‌గ్రామ్‌ వంటి బంగారు ఆభరణాలు కూడా లభిస్తున్నాయి. ఇక తినే వంటకాల మాట వేరే చెప్పనవసరంలేదు. రంజాన్ స్పెషల్ హలీము నుంచి వివిధ శాఖాహార, మాంసాహార వంటకాలు. వివిధ రకాలు పళ్ళు అమ్మే స్టాల్ వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు వ్యాపారులు. షాపింగ్ చేసే వాళ్లు కూడా ఒక ఆనవాయితీగా వస్తువులను కొంటుంటారు. రాత్రి వేళ అన్ని వస్తువులు ఒక చోట దొరకడం వాటిని కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికొచ్చిన సందర్శకులు చెబుతున్నారు..రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష ముగించిన తరువాత ముస్లిం సోదరులు పండ్లను తినడం ఆనవాయితీ... దీంతో చార్మినార్‌ ప్రాంతంలో ఎక్కడ చూసినా రకరకాల పండ్లు కొలువుతీరుతాయి. స్వదేశీ పండ్లతో పాటు అనేక విదేశీ రకాల పండ్లు ఇక్కడ నోరూరిస్తున్నాయి. హలీంతోపాటు ప్రూట్స్‌ ని కూడా రోజా అనంతరం ముస్లిం సోదరులు తీసుకుంటూ ఉండటంతో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అందుకే పండ్ల షాపులు కూడా చాలా హడావుడిగా కనిపిస్తాయి...వివిధ జిల్లాలు.. ప్రాంతాలనుంచి వచ్చే సందర్శకులతో చార్మినార్‌, మక్కామసీదు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. అందంగా ముస్తాబైన పలు చారిత్రాత్మక కట్టడాలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పండగ సీజన్‌ ముగుస్తుండడంతో చార్మినార్‌, పాతబస్తీ ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి... వస్త్రాలు, అలకంరణ వస్తువులు, గృహోపకరణాల్లో వెరైటీ వెరైటీ కలెక్షన్స్‌ చార్మినార్‌ దగ్గరే ఉంటాయి. అర్ధరాత్రి 12 అయిన షాపుల దగ్గర ఉంటే సందడిని బట్టి ఇంది ఎంత స్పెషలో తెలుసుకోవచ్చు. దుస్తులు విషయానికొస్తే స్టోన్‌ వెరైటీస్‌.. కళ్లుచెదిరే కలర్స్‌ ఇక్కడ ఉంటాయి. ఈద్‌ షాపింగ్‌కు స్పెషల్‌ డిజైన్స్‌ ను ముంబాయి, గుజరాత్‌ ప్రాంతాల నుంచి తీసుకొనివస్తారు. రంజాన్‌ మాసంలో ఈవినింగ్‌ టైంలో ముఖ్యంగా రోజా అయిపోయిన తరువాత ఇక్కడ జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.మార్కెట్‌లో ఏ కొత్త చెప్పుల డిజైన్స్‌ విడుదలైన అవి చార్మినార్‌లో లభిస్తాయి. అతి తక్కువధరకు ఎక్కువ డిజైనరీ చెప్పులు లభించడంతో చెప్పుల షాపులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు మ్యాచింగ్‌ డ్రస్సుల కోసం వాటికి సరిపడే మ్యాచింగ్‌ చెప్పులు ఇక్కడ ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి సరిపోయే చెప్పులు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువ డిజైన్స్‌ లో రంగ రంగుల పాదరక్షలు ఇక్కడ లభిస్తుంటాయి.

Related Posts