
విశాఖపట్నం
జమ్మూకశ్మీర్, అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి లో విశాఖ వాసి చంద్ర మౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్ము కాశ్మీర్కు ఆరుగురు వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో విషాదం అలముకుంది.