
బద్వేలు
(సిపిఎం) అనుబంధ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బద్వేలు నాలుగు రోడ్ల సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు గురువారం రాత్రి కాశ్మీర్ పహాల్గాన్ పర్యాటక ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన దాడులను ఖండిస్తూ దేశంలో శాంతిని నెలకొల్పాలని ఉగ్రవాద సంస్థలను రూపుమాపాలని, దాడులకు పాల్పడి అమాయక ప్రాణాలు తీసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీను మాట్లాడుతూ
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పుల జరిపి 28 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనను పిరికిపందా చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల కాల్పులలో అసువులుబాసిన, నేలకొరిగిన భారత ముద్దు బిడ్డలకు కన్నీటి నివాళులు అర్పిస్తూ ప్రగాడ శ్రద్ధాంజలి సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు,స్వల్పంగా గాయపడ్డవారు,తీవ్రంగా గాయపడ్డా వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరారు.మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. అక్కడ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడాలని అందుకు అందరూ సహకరించాలని సంయమనంతో సామరస్యపూర్వకంగా సోదరభావంతో మెలగాలని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు భారత ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు ముష్కరులను పట్టుకొని కులము, మతము , భేదం లేకుండా ఉరిశిక్ష వేయాలన్నారు,భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేతలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా మరియు అశ్రద్ధగా నడుచుకోకుండా ఉక్కుపాదం మోపాలని, అన్నారు భారతదేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉన్నదని, ఇలాంటి సంఘటనలను భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు, ఉగ్రవాదులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకు దెబ్బ తీసి సరైన గుణపాఠం నేర్పాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పటాన్ చాంద్ భాషా, పట్టణ అధ్యక్షులు షేక్ అన్వర్ భాష, పట్టణ నాయకులు ఖాజాగౌస్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, పట్టణ నాయకులు ఎస్. జి నాగార్జున, కె.శివకుమార్, డి. హరి, జి. రాజగోపాల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం. చిన్ని, పట్టణ అధ్యక్షులు ఎస్.ఎం షరీఫ్, పట్టణ నాయకులు షేక్ ఫాతిమా,ఐద్వా మహిళా సంఘం పట్టణ నాయకురాళ్లు పి. మోక్షమ్మ, షేక్ మస్తాన్ బీ, షేక్ కైరోన్ బీ, ఫాతిమా, నాగరత్నమ్మ,చేతి వృత్తిదారుల సంఘం పట్టణ నాయకులు చెప్పలి సుబ్బరాయుడు,గంప సుబ్బరాయుడు, వికలాంగుల సంఘం పట్టణ నాయకులు వెంకటపతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.