YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పుస్తకం..పాట్లు..

పుస్తకం..పాట్లు..
దాదాపు 40 రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. పిల్లలంతా ఉత్సాహంగా బడులకు తరలివస్తున్నారు. కొత్త పుస్తకాలు, యూనిఫాంల హడావిడిలో నిమగ్నమయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సర్కారీ బడులకు సరిపడా పాఠ్యపుస్తకాలు ఇంకా చేరలేదన్న కామెంట్స్ గుంటూరు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే టెక్స్ట్ బుక్స్ జిల్లాకు చేరుకోవాలి. కానీ అలా జరగలేదు. జిల్లాకు అవసరం మేరకు పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. జిల్లాకు 18 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం అని అంచనా వేయగా ఎనిమిదిన్నర లక్షల పుస్తకాలే అందాయని సమాచారం. మొత్తం ఆరు లక్షల మంది విద్యార్థులల్లో ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న దాదాపు మూడు లక్షల మందికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నా జిల్లాకు పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరలేదు. టెక్స్ట్ బుక్స్ విషయంలో మొదటి నుంచీ అధికారులు ఉదాసీనంగా ఉండడం వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్ధి సంఘాలు విమర్శిస్తున్నాయి.
నిజానికి టెక్స్ట్ బుక్స్ మే నెలలోనే వస్తున్నాయని అధికారులు  ప్రకటించారు. అయితే జూన్‌ వచ్చి రెండు వారాలు గడిచిపోయినా వీటిని పూర్తిగా అందించలేకపోయారు. ప్రధానంగా ఆరు నుంచి 9వ తరగతి విద్యార్థులకు అవసరమైన ముఖ్యమైన సబ్జెక్టులు ఇంకా ముద్రణ కాలేదని తెలుస్తోంది. ప్రాథమిక విద్యాభ్యాసంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కూడా ఇంకా పూర్తిగా పుస్తకాలు రాలేదని అంతా అంటున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలకే పుస్తకాలు రాలేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాకు చివర ఉన్న మాచర్ల, రేపల్లె, బాపట్ల, వినుకొండ తదితర ప్రాంతాలకు పుస్తకాలు ఎప్పటికి చేరతాయనేది తెలీడంలేదు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు అవసరమో ఈ మేరకే ఏప్రిల్‌లోనే జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఉన్నతాధికారులు ఉదాసీనంగా ఉండడంతో పుస్తకాలు తక్కువ సంఖ్యలోనే వచ్చాయి. ఇదిలాఉంటే ముద్రణ ఆర్డర్లు నిర్ధారణలో జాప్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలు ఈనెల 12న తెరుస్తున్నారని తెలిసినా ముద్రణ దారులు ఇంకా పుస్తకాల ముద్రణ అయినా రవాణాకు సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ లో కొంత జాప్యం వాస్తవమేనని అన్నారు. ఈనెలాఖరులోగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. 

Related Posts