YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్

రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్

హైదరాబాద్, ఏప్రిల్ 26, 
వేసవికాలం రాగానే చాలామంది చల్లదనం కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి చల్లని పానీయాలను సేవిస్తూ ఉంటారు. అయితే కొందరు సాధారణ కూల్డ్రింక్స్ కు బదులు బీర్లను తాగాలని ఇష్టపడతారు. దీంతో వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల కింద బీర్ల ధరలను పెంచింది. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల వీటి అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. మండే ఎండలతోనే చాలామంది చల్లదనం కోసం ఎక్కువగా బీర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ బీర్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 లక్షల బీర్ల కేసులు అమౌంట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే ఇవి రెట్టింపు అమ్మకాలు అని వ్యాపార వర్గాలు తెలుపుతున్నాయి. ఎండలు మండిపోవడంతోనే చాలామంది బీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. బీర్ల కంటే లిక్కర్ ధరలు తక్కువ గా ఉన్న.. ఎక్కువ శాతం బీర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు శుభకార్యాలకు సమయం ఆసన్నం కావడంతో చాలామంది మద్యం కొనుగోలు చేసే సమయంలో బీర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. ఈ తరుణంలో బీర్ల ఉత్పత్తికి డిమాండ్ పెరిగిపోతుందిఅయితే కేవలం వైన్స్ షాపుల ద్వారా మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, బార్ల ద్వారా కూడా బీర్ల అ మ్మకాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖకు విపరీతమైన ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేసవికాలంలో నిర్ణయించుకున్న లక్ష్యానికి చేరుతున్నట్లు ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ లో మాత్రమే కోటిన్నర బీర్ల అమ్మకాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఐ ఎం ఎల్ లిక్కర్ కేసులు కూడా 4 కోట్ల కేసులు పెంచాలని అనుకుంటున్నారు. అయితే లిక్కర్ కంటే బీర్ల అమ్మకాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.గత మార్చి 22వ తేదీన ఒక్కరోజే దాదాపు 4 లక్షల కేసుల బీర్లు అమ్ములు పోయాయి. ఆ తర్వాత రోజు నుంచి యావరేజ్ గా ప్రతిరోజు మూడు లక్షల కేసులు అమ్ముడుపోతున్నాయి. ఇక ఏదైనా సెలవులు వస్తే ఈ సేల్స్ మరింత స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాగే సేల్స్ పెంచుకుంటూ పోతే ఈ రెండు నెలల్లోనే టార్గెట్ ను రీచ్ అయ్యి అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ పేర్కొంటుంది. అయితే త్వరలో లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే బీర్ల ధరలను పెంచింది. అయినా ధరలను లెక్కచేయకుండా బీర్లను ఎక్కువగా సేవిస్తూ ఉన్నారు. ఎండాకాలం కావడంతో పాటు ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడంతో చల్లదనం కోసం ఎక్కువగా బీర్లని కొనుగోలు చేస్తున్నారు.

Related Posts