
విజయవాడ
పహల్గామ్ లో అత్యంత హృదయ విదారక ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరంలో దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అనుక్షణం దేశ ప్రజలకు అండగా నిలుస్తున్న భద్రతా దళాలను నిందించడం సరికాదు. ఎన్నో ఉగ్ర దాడులను ముందుగానే పసిగట్టి ప్రజలను రక్షించాయి భద్రతా దళాలు. 10 సంవత్సరాలలో దాదాపు 15 కోట్లకు పైగా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ని సందర్శించారు. దేశ ప్రజల రక్షణకు మోదీ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని తీసుకుంటున్న చర్యలను పొగుడుతున్నాయి. కేవలం హిందువనే కారణంతో కళ్ల ఎదుట భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారు అని బాధితులే స్వయంగా చెప్తుంటే షర్మిల మాత్రం ముస్లింలను వెనకేసుకురావడం దేనికి సంకేతం? తీవ్రవాదులు మగవారిని కాల్చి చంపే ముందు వారి పేర్లు, మతం కనుక్కుని మరీ హిందువులనే కారణంతోనే చంపారు. మరణించిన హిందువులకు అండగా నిలవాల్సింది పోయి బీజేపీపై, కేంద్ర నిఘా సంస్థలపై ఎదురు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.