YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్

పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్

హైదరాబాద్
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన.  30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు.
బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.  అభివృద్ధిలో దూసుకు పోతున్న భారత్ ను చూసి ఓర్వలేక పోతోంది. మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అండగా నిలవండి. రోజ్ గార్ మేళా మోదీకి ఇష్టమైన కార్యక్రమం.  10 లక్షల ఉద్యోగాల భర్తీ మార్క్ కు చేరుకున్నాం.  కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు హ్యాట్సాప్.  ఇష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయండి. సంక్షేమ పథకాలు చిట్టచివరి వ్యక్తికి కూడా అందేలా చేయండని అన్నారు.
హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ లో  రోజ్ గార్ మేళా లో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి అపాయిట్ మెంట్ లెటర్లు అందజేసారు.
తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వనుకు పుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.
 హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన రోజ్ గార్ మేళా, కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన మీరంతా ఇకపై మీకప్పగించిన బాధ్యతలను ఇష్టపడి నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి.  మీకు తెలుసు. ఉద్యోగావకాశాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోదీ సంకల్పం. అందుకే  10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగాం. మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్రమోదీదే. గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘనత మోదీకే దక్కుతోంది.
అంతేగాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నారు. గతంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానంలో నిలిపారు. మరో మూడేళ్లలో 3వ స్థానానికి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారు. అట్లాగే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అప్పటికి అమెరికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నదే మోదీ ఆకాంక్ష. మోదీ కృషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. 

Related Posts