
పెద్దపల్లి ప్రతినిధి:
ఈనెల 22న కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహాల్గామ్ లో యాత్రికులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి చేసి 28 మందిని చంపిన ఘటనను పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమల్ కిషోర్ శారడ, సయ్యద్ మస్రత్, కోశాధికారి కొమురవెల్లి జయప్రకాష్ ఖండించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ ఈనెల 29 న మంగళవారం పెద్దపల్లి బందుకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందులో పాల్గొనాలని కోరారు. లారీ అసోసియేషన్, ఆటో యూనియన్, కూరగాయల మార్కెట్, ఆటోలు, వ్యాన్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రీ సంస్థలు బందుకు మద్దతు ప్రకటించారని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు బందు పాటించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాడూరి వినోద్ కుమార్, దేవరకొండ రాజు, వనపర్తి శ్రీనివాస్, కొత్తపల్లి సత్యనారాయణ, తాహెర్ ఖాన్, లక్ష్మీనారాయణ, అఖిల్, ఖరీం, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.