YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కావ్య పాప... టీంతో.. ప్లాన్

కావ్య పాప... టీంతో.. ప్లాన్

హైదరాబాద్, ఏప్రిల్ 28, 
గత ఏడాది అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి మాత్రం బొక్క బోర్లా పడింది. ఏదైతే తమ బలంగా భావించిందో అదే సన్ రైజర్స్ కొంపముంచింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఏకంగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. కానీ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన టైమ్ లో మళ్ళీ చెన్నైపై గెలిచి ఆశలు నిలుపుకుంది. సీఎస్కేను ఓడించినా కూడా సన్ రైజర్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని చెప్పలేం.. మిగిలిన జట్ల రన్ రేట్,. మ్యాచ్ ఫలితాలు కూడా కలిసి రావాలి. మిగిలిన ఐదు మ్యాచ్ లనూ గెలవాల్సి ఉంటుంది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలుపు అనంతరం… హైదరాబాద్ ప్లేయర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 12 సంవత్సరాల తర్వాత వాళ్ల సొంత గడ్డపై విజయం సాధించిన నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు చిల్ అవుతున్నారు. చెన్నై నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లిపోయారు హైదరాబాద్ ప్లేయర్లు. అక్కడ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు అలాగే పబ్బులు అంటూ… తెగ తిరుగుతున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు. తమ కుటుంబ సభ్యులను కూడా మాల్దీవుల ట్రిప్పుకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయిప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఐదు మ్యాచ్లు కచ్చితంగా గెలవాల్సిందే. దీని కోసం ప్రాక్టీస్ లో చెమటోడ్చాల్సిందే. కానీ సీజన్ మధ్యలో ఆరెంజ్ ఆర్మీ మాత్రం మాల్దీవులకు వెకేషన్ వెళ్ళడంపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అసలు కావ్య పాపా వాళ్ళని అక్కడికి ఇలా పంపించింది.. ఆమెకు తెలియకుండానే హైదరాబాద్ ప్లేయర్లు మాల్దీవులకు వెళ్లిపోయారా.. అనే ప్రశ్న కూడా వేధిస్తోంది. వాస్తవానికి.. హైదరాబాద్ జట్టుకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకే సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. వాళ్లు రిలాక్స్ గా ఉంటే తర్వాత మ్యాచ్ లో దూకుడుగా ఆడతారనే ఉద్దేశంలోనే మాల్దీవులకు పించినట్లు తెలుస్తోంది. ఆమె చెన్నైలోనే ఉంటూ వాళ్లను పంపించింది. తర్వాతి మ్యాచ్ బెంగళూరు తో జరగనున్న నేపథ్యంలో… ఈ టూర్ ప్లాన్ చేసిందని జట్టు వర్గాలు తెలిపాయి. ఈ టూర్ వెళ్లిన తర్వాత ఐదు మ్యాచ్లకు 5 గెలవాల్సిందేనని కండిషన్ కూడా పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మాల్దీవుల్లో ఫుల్లుగా రిలాక్స్ వచ్చి గ్రౌండ్ లో దుమ్మురేపేందుకు ఎస్ఆర్ హెచ్ టీమ్ రెడీ అవుతోంది.

Related Posts