
మంథని
తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించిన రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్పీచ్ ప్రజల్లో ఉత్సాహం నింపిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. రజతోత్సవ సభకు ఎన్ని అడ్డంకులు పెట్టిన మంథని నియోజకవర్గం లోని కమాన్ పూర్, రామగిరి, ముత్తారం, మంథని, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, పలిమేల మండలాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో డ్రైవర్లు మరియు వివిధ వర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా తరలివచ్చి సక్సెస్ చేసినందుకు ఆయన ధన్యవాదములు తెలియజేశారు,గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను కార్యకర్తలను అభిమానులను సభకు తీసుకువెళ్లి సభా సక్సెస్ కు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటను అర్థం చేసుకోవాలని ఆయన పూర్తితోనే ముందడుగు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరిగిన భీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన కార్మికులు కర్షకులు మేధావులు పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు