
హైదరాబాద్
కేసీఆర్ చేసిన విధ్వంసంతోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్లి పరామర్శించా. ఎవరూ చావును కోరుకోరు కదా రేవంత్. నేను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుక పడ్డాం. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేశామని అన్నారు. కేసీఆర్ లా పథకాలను లాంచ్ చేసి వదిలేయను. కేసీఆర్వి అన్నీ శాంపిల్ పథకాలు. అరెస్టుల విషయంలో తొందర పడితే ఏపీలో ఏం జరిగిందో చూశాం కదా అని అన్నారు.