YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇప్పుడు సజ్జలే టార్గెట్టా...

ఇప్పుడు సజ్జలే టార్గెట్టా...

విజయవాడ, ఏప్రిల్ 29, 
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా అరెస్ట్ లు జరుగుతున్నాయి. ఐపీఎస్ లతో పాటు రాజకీయ నేతలు కూడా ఇప్పటికే జైలుకు వెళుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బందులు పెట్టిన వారిపై పాత కేసులు తోడి మరీ లోపలికి పంపుతున్నారు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్ తో పాటు తాజాగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఇలా ఒక్కొక్కరు కీలక నేతలు జైలుకు వెళ్లి వస్తున్నారు. వీరిలో కొందరు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు రాగా, మరికొందరు జైళ్లలోనే మగ్గుతున్నారు. అయినా సరే.. గతంలో కీలకంగా మారిన వారందరిపైనా వరస కేసులు నమోదవుతుండటంతో ఇప్పుడు అందరి వేళ్లూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపుతున్నాయి.. సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు అప్పటి విపక్షాలు సకల శాఖ మంత్రిగా కూడా పేరు పెట్టారు. ప్రధానంగా హోం శాఖను ఆయన చెప్పుచేతల్లో ఉంచుకుని మరీ నాడు టీడీపీ నేతలను, కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండటానికి కూడా సజ్జల డైరెక్షన్ అని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ ను బయటకు తీసుకు వచ్చి నాడు సీఐడీ, ఇతర పోలీసు అధికారులతో మాట్లాడి చంద్రబాబు అరెస్ట్ వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని టీడీపీ అగ్రనేతలే భావిస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లే నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పెద్దలకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఏమీ చేయలేకపోతున్నామన్న బాధ కనిపిస్తుంది. అయితే చట్టప్రకారంగా, అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతనే ముందుకు వెళితేనే న్యాయస్థానాల్లో కూడా సజ్జలకు వెసులుబాటు లభించదన్న అంచనాలతో అధికారులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి పార్టీలకు కొరకరాని కొయ్యగా మారిన తరుణంలో ఆయన అరెస్ట్ ఎప్పుడు అన్నది ప్రతి రోజూ సోషల్ మీడియాలో టాపిక్ గానే మారింది. కొసరు నేతలకు కోరి పదవులు ఇస్తారా ఏంది? బలమైన చట్టం ఉన్న... అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నమోదవుతాయన్న కేసుల విషయంలో ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం నుంచి తెచ్చుకుని కొంత ఊరట చెందుతున్నారు. అయితే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అటవీ భూముల ఆక్రమణలో సజ్జల కుటుంబం ప్రమేయం ఉందని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. అటవీ శాఖ చట్టాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వు ఫారెస్ట్ లో అడవిని నరికి అడ్డంగా సజ్జల ఫ్యామిలీ దున్నేసిందన్న ఆరోపణలున్నాయి. అరవై ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ, రెవెన్యూ శాఖల నివేదిక కూడా ఇవ్వడంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. యాభై ఎకరాలు ఆక్రమణకు గురైందని అటవీశాఖ చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు లోతుగా సర్వే చేసి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Related Posts