YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యాపారం మీది, పెట్టుబడి ప్రభుత్వానిది

వ్యాపారం మీది, పెట్టుబడి ప్రభుత్వానిది

నెల్లూరు, ఏప్రిల్ 30, 
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి వ్యాపారవేత్తలను సిద్ధం చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఆ దిశగా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ హామీలో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఔత్సాహికులు సొంతగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా పది మందికి పని కల్పించేందుకు వీలు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ఔత్సాహికులకు లోన్ ఇచ్చే స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో లోన్ తీసుకున్న వారంతా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలు, రవాణా, పరిశ్రమలు, సేవల రంగం, వ్యాపార రంగాల్లో నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేయవచ్చు. ఉపాధి పొందడమే కాకుండా తోటి వారికి కూడా పని కల్పించే అద్భుతమైన అవకాశానని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రస్తుతానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే పదో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఇలా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని 32 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇందులో కొన్నింటికి మినిమం అర్హత పెట్టారు. మరికొన్నింటికి అసలు ఎలాంటి విద్యార్హత లేకుండానే అప్పులు ఇవ్వబోతున్నారు. ఈ స్కీమ్ పొందాలంటే అర్హతలు ఏంటీ?
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్ పొందాలంటే లబ్ధిదారుడు ఏదైనా SC కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఏపీకి చెందిన వ్యక్తులే ఈ స్కీమ్‌కు అర్హులు. లబ్ధిదారుడి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (BPL) వర్గంలో ఉండాలి.
మొదటి లబ్ధిదారుడు https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. అనంతరం యూజర్ ఐడి & పాస్‌వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్. పాస్‌వర్డ్ అంటే ఆ నెంబర్‌కు వచ్చే OTP దీని ఆధారంగా లాగిన్ అవ్వాలి. అనంతరం రెండో దశలో లబ్ధిదారుడు తన దరఖాస్తు పూర్తి చేయడానికి అడ్రెస్‌, కులం, విద్యార్హతలు, పథకం వివరాలు పూర్తి చేసి స్కీమ్‌లోకి లాగిన్ అవ్వాలి. అప్లై చేసిన తర్వాత దరఖాస్తుదారుడు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.  ఎస్సీ కార్పొరేషన్ మూడు విభాగాల్లో రుణాలు ఇస్తుంది. మొదటి విభాగంలో ఉన్న వారికి రూ.3 లక్షలలోపు పెట్టుబడి వ్యయం యూనిట్లు అందజేస్తారు. రెండో విభాగంలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు వారికి పెట్టుబడి సాయం అందజేస్తారు. మూడో జాబితాలో రూ. పది లక్షలపైన ఆర్థిక సాయం చేస్తారు. మొదటి కేటగిరిలో లబ్ధిదారులకు ప్రభుత్వం 60 శాతం సాయం చేస్తుంది. బ్యాంకులు 35 శాతం రుణం ఇస్తాయి. ఐదు శాతం లబ్ధిదారులు వాటా పెట్టుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా ఈ కేటగిరిలో లక్ష రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చును. రెండో కేటగరిలో ప్రభుత్వం నుంచి 40 శాతం సాయం అందనుంది. బ్యాంకులు 55 శాతం వరకు రుణాలు ఇస్తాయి. మిగిలిన ఐదు శాతం లబ్ధిదారులు పెట్టుబడి పెట్టుకోవాలి. ఈ కేటగిరిలో ఇచ్చే రాయితీలు ఇతర ఫెసిలిటీసే మూడో కేటగిరికి కూడా వర్తిస్తాయి.

Related Posts