YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సర్పంచ్ లకు జూలై 31 వరకు చెక్ పవర్ గ్రామాల్లో కొనసాగుతున్న హడావిడి పనులు

సర్పంచ్ లకు జూలై 31 వరకు చెక్ పవర్ గ్రామాల్లో కొనసాగుతున్న హడావిడి పనులు
రాష్ట్రంలోని పంచాయతీలకు జూలై నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నా హాలు చేపట్టింది. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణనను అధికారులు దాదాపు పూర్తి చేశారు. చెక్ పవర్ వినియోగం విషయంలో కొంత అయోమయం నెలకొంది. అయితే ప్రభుత్వ చర్యలు, విశ్వసనీయ సమాచారం మేరకు చెక్ పవర్ కొనసా గనున్నట్లు తెలుస్తుంది. చెక్ పవర్ రద్దు విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొంది. పదవీకాలం ముగిసే జూలై 31 వరకు చెక్ పవర్‌ను కొనసాగించాలని, ఆ రోజు వరకూ అభివృద్ధి కార్య క్రమాలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్న విషయం విదితమే. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాలను పురపాలక సంఘాల పరిధిలో కలిపింది. ఎన్నికల సంఘం తొలిసారిగా నోటాను ప్రవేశపెట్టడంతో పాటు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరచింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రతి సారీ సర్పంచుల పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే ప్రభుత్వం అన్ని గ్రామపంచాయతీలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలను ప్రత్యేకాధికారులుగా నియమించి సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయడం ఆనవాయితీగా వస్తోంది. జూలై 31 నాటికి పదవీ కాలం ముగియడానికి మరో 45 రోజులున్నా.. ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యేకాధికారులను నియమించలేదు. సర్పంచుల చెక్‌పవర్‌నూ రద్దు చేయలేదు. దీనితో అది చివరి రోజు వరకూ కొనసాగిస్తారని స్పష్టమవుతుంది. మరో పక్క సర్పంచులు ఈ అవకాశాన్ని తమకనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ పదవీ కాలం ముగిసే నాటికి పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేయడం వల్ల నాణ్యత కొరవడుతుంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Related Posts