YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తెలుగులోకి అన్యా సింగ్

తెలుగులోకి అన్యా సింగ్
ఉత్తరాదికి చెందిన ఎందరో హీరోయిన్స్ దక్షిణాది సినిమాల్లో నటించి ఇక్కడి  ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నవారే. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్‌లో లెక్స్ టాలినియాస్, ఖైదీ బ్రాండ్‌లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అన్యాసింగ్ ఇప్పుడు ద్విభాషా చిత్రం ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ రాజా దర్శకత్వంలో ఈ సూపర్‌నేచురల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. మరి ఈ సినిమాతో అన్యాసింగ్ దక్షిణాది సినిమాల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.

Related Posts