YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

24 ముద్దులు పెడతానంటోన్న హెబ్బ

 24 ముద్దులు పెడతానంటోన్న హెబ్బ
బోల్డ్ అంట్ డైనమిక్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన హెబ్బా పటేల్ కొంతకాలంగా కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈసారి ముద్దులతో విరుచుకుపడతానంటోంది ఆ ముద్దుగుమ్మ. మరి అమ్మడి ముచ్చట తీరేనంటారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.హెబ్బా పటేల్ పేరు వింటేనే తెలుగు కుర్రాళ్లు తెగ మెలికలు తిరిగిపోతారు. గ్లామరస్ గా కనిపిస్తూనే... యాక్టింగ్ టాలెంట్ తోనూ కట్టిపాడేసిన ఈ బొద్దుగుమ్మ... ఈ మధ్య బొత్తిగా తన ఛార్మ్ కోల్పోయిందనే చెప్పాలి. వరుస ఫ్లాపులు అమ్మడి స్పీడ్ కు బ్రేకులు వేశాయి. కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హెబ్బా.... గతేడాది వరకూ చేతినిండా ఆఫర్లతో సూపర్ బిజీగానే గడిపింది. అయితే మిస్టర్, అందగాడు, ఏంజెల్ సినిమాలు వరసపెట్టి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. అమ్మడి జోరు  తగ్గింది. అయితే తాజాగా 24 కిస్సెస్ అనే సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే పనిలో పడింది మన హెబ్బ.మిణుగురులు ఫేమ్ అయోధ్యకుమార్ తెరకెక్కిస్తున్న 24కిస్సెస్ లో హెబ్బ హీరోయిన్ గా కనిపించబోతోంది. హీరోగా అదిత్ ఆర్యా నటించనున్నాడు. అడల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హెబ్బ ఓ జర్నలిస్ట్ గా కనిపించనుందట. మరి ఈ సినిమా అయినా అమ్మడి ఫేట్ మారుస్తుందేమో చూడాలి. 

Related Posts