- స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
దేశంలోని పౌరులందరికి సమానత్వం వర్తింపచేయాలన్నది మన రాజ్యాంగంలోని కీలక అంశమని సుప్రీంకోర్టుసీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. విజయవాడలోని సిద్దార్ధ కళాశాల అధ్వర్యంలో జరిగిన కంఠంనేనిరవీంద్రరావు స్మారక ఉపన్యాసనికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. రాజ్యంగంలోని రాజ్యాంగ ధర్మం, పౌరసమాజం అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా సమానత్వం సాధించాలనేది రాజ్యంగ లక్ష్యమని.. అయితే మన దేశంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు కీలక అంశం కావడం, వారసత్వ రాజకీయాలు, అవినీతి పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఒక రాజకీయ చెందినవాడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా పదవి చేపట్టిన వెంటనే రాజకీయాలతో సంబంధాలు వదులుకున్నానని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం సరికాదన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మరో ఏ పదవి కోరబోనని ఆయన స్పష్టంచేశారు.