వేతనాలు పెంచాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికు హోంగార్డులు వినతి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీఎంతో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్ భేటీ అయ్యారు. ప్రస్తుతం హోంగార్డులకు రూ. 12వేలు వస్తున్నాయని, దాన్ని 21వేలకు పెంచాలని సీఎంకు వినతి చేశారు. మరోవైపు చంద్రబాబు నివాసం వద్దకు హోంగార్డులు భారీగా తరలివచ్చారు.అయితే హోమ్ గార్డులు కి సబంధించి రెండు అసోసియేషన్ లు ఉండటంతో ఇరువురి మధ్య సమన్వయ లోపంతో ఒక అసోసియేషన్ వారు మాత్రమే సీఎం ని కలిసేందుకు వచ్చారు.. దీనితో రెండో అసోసియేషన్ వారు సమావేశమైనట్లు సమాచారం..