YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పై ప్రివిలేజ్ మోషన్

పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పై ప్రివిలేజ్ మోషన్
శాసన సభ కమిటీలన్నీ కాన్సిట్యూషనల్ బాడీస్. వాటికి సంబంధించిన చర్చలు, పేపర్లు, రిపోర్టులు అన్నీ కాన్ఫిడెన్సియల్. వాటిని మీడియాకే కాదు ఎవరికీ ఇవ్వకూడదు. బహిర్గతం చేయరాదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఎవరికైనా ఇస్తే అది కంటెంప్ట్ ఆఫ్ హవుస్ కిందకు వస్తుంది, నిబంధనల అతిక్రమణే కాదు, శాసనసభా ధిక్కారమే కాదు నేరం కూడా అని వివరణ ఇచ్చారు. వివిధ అంశాలపై సమగ్ర అధ్యయనం చేయడానికే సభ్యలకు గాని, పీఏసికి గాని ఆయా శాఖలు పేపర్లను అందజేస్తాయి.వాటిని ఎవరికీ ఇవ్వకూడదు,మీడియాతో సహా.ఒకవేళ ఆ పేపర్లను ఎవరికైనా ఇవ్వడం జరిగితే అది సభాధిక్కారమే కాదు నేరం కూడా సభ్యుడిగా ప్రమాణం సందర్భంగా చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించడమే నని అన్నారు. ఏసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలో బిజెపి పెద్దలను కలిసినట్లుగా మీడియాలో వచ్చింది. ఛైర్మన్ హోదాలో సేకరించిన పేపర్లను వారికి అందజేసినట్లుగా కూడా వచ్చింది. శాసనసభలో ప్రాతినిధ్యం లేని వ్యక్తికి, రాజకీయ పార్టీ సభ్యునికి ఏవిధంగా పిఏసి పేపర్లను బుగ్గన అందజేస్తారు..?ఇది శాసనసభా ధిక్కారం కాదా..? శాసనసభ ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధం కాదా అని యనమల ప్రశ్నించారు.  అదే నిజమైతే బుగ్గనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకని చేపట్టకూడదు. గతంలో ప్రశ్నలు అడగడానికి కూడా ప్రలోభాలకు గురైన అంశం తెలిసిందే.అదెంత నేరమో ఇది కూడా అంతకన్నా నేరమని అయన అన్నారు. 

Related Posts