YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంద కృష్ణ విమర్శలు అర్ధరహితం : సీపీఎం

మంద కృష్ణ విమర్శలు అర్ధరహితం : సీపీఎం
వరంగల్లో నిర్వహించిన దళిత, గిరిజన సింహగర్జన సభకు సీపీఐ(ఎం) గైర్హాజరుపై మంద కృష్ణమాదిగ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేసారు. దళిత, గిరిజన హక్కులపైనా, చట్టాలపైనా జరిగిన అన్ని పోరాటాలలో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం, పున్నయ్య కమిటీ నియామకం, అటవీహక్కుల చట్టం, మంద కృష్ణపై నిర్భంధం, సామాజిక న్యాయ ఎజెండాగా సాగిన పాదయాత్ర విషయంలో సీపీఐ(ఎం) ముందుపీఠిన ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే సమస్యపై వైఖరి తీసుకోవటం, ఆ సమస్యపై ఎవరితో కలిసి వేదికలు పంచుకోవాలనేది రెండూ వేరు వేరుగా చూడాలి. వేదికలు పంచుకోవడమనేది ఆయా రాజకీయ పార్టీల విధానాలకు లోబడి ఉంటుంది. తెలంగాణాలో బిజెపి, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలని సీపీిఐ(ఎం) ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసి వేదికను పంచుకోవటం అనేది మాకు సాధ్యం కాని పని. ఈ విషయాన్నే సభ నిర్వాహకులకు చెప్పటం జరిగింది. గతంలో కోదండరాం ఆధ్యర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సు సందర్బంగానూ, ధర్నాచౌక్ రక్షణ పోరాటం సందర్భంలోనూ, ఇంకా ఇతర అనేక సందర్భాలలోనూ మా పార్టీ ఈ వైఖరినే తీసుకోవటం, ప్రకటించటం, ఆచరించటం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలన్నీ మమ్మల్ని కలిసిన నాయకులకు తెలియజేసి ఎజెండాకు మా మద్దతు ఉంటుందని చెప్పటం కూడా జరిగింది. అయినా మా ఆమోదం లేకుండానే కరపత్రాలలో, పోస్టర్లలో మా పార్టీ నాయకుల పేర్లు వేయటం, రాలేదని అభాండాలు వేయటం ఏ రకమైన సంస్కృతో వారికే తెలియాలి. దళితులు, గిరిజనులు, సామాజిక న్యాయం వగైరా అంశాలలో మేము సాగిస్తున్న అనేక పోరాటాలు, ఉద్యమాలలో మేము ఆహ్వానించిన పార్టీలు, సంఘాలు పాల్గొన్నవారు, నిరాకరించినవారు ఎందరో ఉన్నారు. కలిసి వచ్చిన వాళ్లను కలుపుకుపోతున్నాం తప్ప మేము పిలిస్తే రానందుకే తప్పుబట్టి విమర్శించే కుసంస్కృతిని మేము ఎన్నడూ ప్రదర్శించలేదని అన్నారు. ఎస్సీ,ఎస్టీ యాక్టుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై మా పార్టీ రాష్ట్రస్థాయిలో, అఖిలభారత స్థాయిలో వెంటనే స్పందించింది. నిరసన కార్యక్రమాలు చేసింది. సీపీఐ(ఎం) పార్టీపై మంద కృష్ణమాదిగ విమర్శను ఖండిస్తున్నాం. మా వైఖరిని తెలియజేస్తున్నాం. ప్రజలు, బహుజన శ్రేణులు, నాయకులు గమనించాలని తమ్మినేని విజ్ఞప్తి చేసారు. 

Related Posts