YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏపీలో నాలుగు లక్షల ఉద్యోగాలు

 ఏపీలో నాలుగు లక్షల ఉద్యోగాలు
జాబు రావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల ముందు టీడీపీ ప్రచారం చేసింది. విభజన కష్టాల నుంచి ఏపీ గట్టెక్కాలన్నా, యువతకు ఉపాధి లభించాలన్నా.. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సీఎం అయితేనే బాగుంటుందని ప్రజలు నమ్మారు. ఫలితంగా బాబు సీఎం అయ్యారు. చంద్రబాబు సర్కారు ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. మరి మీరిచ్చిన హామీల మాటేమిటి? యువతకు ఉద్యోగాలేవి? అని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా విపక్షానికి దీటుగా బదులిచ్చారు. మేం కల్పించిన ఉద్యోగాలు ఇవిగో, దమ్ముంటే మాతో వచ్చి తనిఖీ చేసుకోండంటూ సవాల్ విసిరారు. ఏపీలో గత నాలుగేళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరిన మాట నిజమేనా? ఎన్ని ఎంఓయూలపై సంతకాలు చేశారు? రాష్ట్రానికి ఎంత మేర పెట్టుబడులు వచ్చాయి? ఎంత మంది స్థానిక యువతకు వాటిల్లో ఉపాధి లభించిందో చెప్పాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధురీ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. ‘‘ఏపీలో 2015 నుంచి ఇప్పటి వరకూ 2680 ఎంఓయూలు కుదిరాయి. రూ.17,80,891 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 41,99,357 మందికి ఉద్యోగాలు లభించాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Related Posts