YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నా నువ్వేకి మిక్స్డ్ రెస్పాన్స్

నా నువ్వేకి మిక్స్డ్ రెస్పాన్స్

మాస్ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న కళ్మాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించబోతున్నారు అనగానే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొంది. పైగా వీరిద్దరిపై ఓ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది అంటే.. అది మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మరి నా నువ్వే ఈ అంచనాలను అందుకుందా... లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్ 

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ సమర్పణలో కూల్ బ్రీజ్‌ సంస్థ నిర్మించిన నా నువ్వే చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం కళ్యాణ్ పూర్తి స్థాయి లవర్ బాయ్ గెటప్‌లోకి మారిపోయిన సంగతి తెలిసిందే... హీరోగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న కళ్యాణ్ నా నువ్వే సినిమా కోసం స్టైల్ మార్చి న్యూ లుక్ తో అలరించే ప్రయత్నం చేసాడు. మిల్కీ బ్యూటీ తమన్నా నా నువ్వే కోసం మొదటిసారి కళ్యాణ్‌ రామ్‌తో జోడి కట్టింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.  ప్రేమకథలను హృద్యంగా ప్రజంట్ చేసే పి.సి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కుదరలేదన్నది క్రిటిక్స్ మాట. ప్రోమోల్లో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించినా... సినిమాలో మాత్రం అంత పండలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మఖ్యంగా సాఫ్ట్ రోల్ లో కల్యాణ్ రామ్ ను జీర్ణించుకోవడమే కష్టమైందన్నది వారి అభిప్రాయం. అయితే తమన్నా మాత్రం తన అందచందాలతో ఆకట్టుకుందని తెలుస్తోంది. శరత్ అందించిన మ్యూజిక్ కు మంచి స్పందన లభించగా... తనికెళ భరణి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి వంటి మంచి స్టార్ క్యాస్ట్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదన్నది మరి కొందరి వాదన. 

Related Posts