YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామాల్లో రైతుల సందడి

గ్రామాల్లో రైతుల సందడి

జిల్లా లో ఈ ఏడాది వానాకాలం పంటల సాగు ప్రారంభంకాగా.. గ్రామాల్లో రైతుల సందడి కనిపిస్తోంది. సీజన్ ప్రారంభం నుంచి క్రమంగా వర్షాలు పడుతుండడం తో రైతులు విత్తనాలు వేసే బిజీలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పత్తి లక్షా 24 వేల హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. వానాకాలం ప్రారంభం నుంచి కురుస్తోన్న వర్షాలు పంటల సాగుకు అనుకూలిస్తున్నాయి. జిల్లాలో ఐదు రోజులుగా పడుతున్న వర్షాలతో రైతులు విత్తనాలు వే సుకొనే అవకాశం లభించిందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. వానలు పడుతుండడంతో రైతులు పత్తి విత్తనాలను ఎక్కువగా వేస్తున్నారని, సోయా, కంది విత్తనాలను విత్తడం సైతం ప్రారంభించారన్నారు. వారం రోజుల్లోపు జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ విత్తనాలు వేయడం పూర్తవుతుందని వారు తెలిపారు.ఇప్పటికే 30 శాతం మంది రైతులు విత్తనాలు వేయగా.. సోయాబీన్, కంది విత్తనాలు వేయడం ప్రారంభించా రు. సోయాబీన్ 40 వేల హెక్టార్లలో, కంది పంటను రైతులు 24,600 హెక్టార్లలో సాగుచేస్తారని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు జొన్న 6వేల హెక్టార్లు, పెసర్లు 2 వేలు, మినుములు 2 వేల హెక్టార్లలో సాగు కానున్నాయి. ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.181 కోట్లను పంటపెట్టుబడి సాయం కింద రైతులకు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రైతులకు సీజన్ ప్రారంభంలో విత్తనాలు వేసే అవకాశం లభించింది. వారం రోజుల్లో జిల్లా వ్యా ప్తంగా అన్ని విత్తనాలను వేయడం పూర్తి చేస్తారని, ప్ర స్తుతం కురిసిన వర్షాలు విత్తనాలు నాటడానికి అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. సీజన్ ప్రారంభం నుంచి వ్యవసాయ అధికారులు రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటు లో ఉంచారు. సోయాబీన్ విత్తనాలను సబ్సిడీపై ఆన్‌లైన్ విధానంలో అధికారులు రైతులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో సబ్సిడీ విత్తనాల పంపిణీలో పారదర్శకత నెలకొంది. గతంలో జిల్లాలోని రైతులకు పంపిణీ చేసే విత్తనాలు మహరాష్ట్రకు సరఫరా చేసేవారు. వ్యవసాయ క్లస్టర్ల వారీగా అధికారులు ముందుగానే రై తులు సాగుచేసే పంటల వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా విత్తనాలను అందుబాటులో ఉం చారు. ఆన్‌లైన్ విధానంతో రైతులకు సరిపడా విత్తనా లు దొరుకుతున్నాయి.  సుమారు 8 నెలల పాటు ఈ పంటను ఉంచుతారు. అక్టోబర్‌లో పంట దిగుబడి ప్రారంభం కానుం డగా.. జనవరి, ఫిబ్రవరి వరకు నీటి సౌకర్యం ఉన్న రైతులు పత్తికి నీళ్లు పెడుతూ పంటను తీస్తారు. ఈ పం టకు చీడపీడలు, తెగళ్లు బెడద కూడాఎక్కువగా ఉం టుంది. గత ఏడాది వరకు రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దళారులపై ఆధారపడేవారు. దళారులు కేవలం పత్తి విత్తనాలను మాత్రమే రైతులకు అప్పుగా ఇచ్చేవారు. దీంతో రైతులు ఇతర పంటలు వేయాలని భావించినా విత్తనాలు లభించకపోవడంతో పత్తిని మాత్రమే వేసేవారు. దళారులు అప్పు కింద ఇచ్చిన విత్తనాలు నాసిరకంగా ఉండడంతో పంటదిగుబడులు సరిగా వచ్చేవి కావు. ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంతో రైతులకు ఇలాంటి ఇబ్బందులు దూరమయ్యాయి. సీజన్‌కు ముందుగానే వారి వద్ద డబ్బులు ఉండడంతో రైతులు తమకు కావాల్సిన మేలు రకమైన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది రైతుబంధు పథకం డబ్బులు ఉండడంతో సోయాబీన్ వైపు మళ్లుతున్నారు. స్వల్పకాలిక పంటల కావడంతో మూడున్నర నెలల్లోనే సోయా పంట చేతికి వస్తుంది. ప్రభుత్వం నవంబర్‌లో రెండో పంట పెట్టుబడి ఇస్తుండడంతో రైతుల శనగ, గోధమ, పల్లి లాం టి పంటలను సాగుచేసుకొనే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Related Posts