YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గడగడలాడిస్తున్న సైబర్ నేరాలు

గడగడలాడిస్తున్న సైబర్ నేరాలు

సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు రెచ్చిపోయి అలజడి సృష్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వాన్నక్రై, రాన్సమ్‌వేర్, ఇటర్నల్‌రాక్స్ వంటివి ప్రపంచాన్ని గడగడలాడించాయి.  సమస్య హ్యాకింగ్ దీని బారిన పడకుండా పెద్దపెద్ద కంపెనీలే కాదు. మన ఇండ్లలో ఆఫీసుల్లో ఉపయోగించే కంప్యూటర్లకు కూడా హ్యాకింగ్ సమస్య పొంచి ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈ మాల్‌వేర్ దాడులకు గురవుతున్నారు. అందుకే ముఖ్యమైన సమాచారాన్ని కంప్యూటర్లలో భద్రపర్చుకునేవారు. ఆ దాడుల బారిన పడకుండా ఈ హ్యాకింగ్ ఎదుర్కోవడంపై అవగాహన పెంచుకోవాలి.ప్రతి నిత్యం ఎన్నో రకాల వైరస్‌లు మన కంప్యూటర్లపై దాడులు చేస్తూనే ఉన్నాయి. దీన్ని నియ్రంతించుకొని మన డేటాను భద్రంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీ కంప్యూటర్‌ను హ్యాక్ చేయడంలో వైఫై రూటర్ ఏర్పాటు చేసిన ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనదే. చాలామంది దీనిని గుర్తించరు. సిగ్నల్స్ బాగా రావాలంటూ వైఫై రూటర్‌ను మెయిన్‌డోర్ దగ్గర, కిటికీ దగ్గర సెట్‌చేస్తారు. ఇది సరైన పద్దతి కాదు. సిగ్నల్ బయటకు వెళ్లకుండా రూటర్‌ను ఇంటి మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దీంతో మీ సిగ్నల్స్ ఇంటి బయటకు వెళ్లే అవకాశం చాలా తక్కువ. ఇది మీకు మరింత భద్రత కల్పిస్తుంది.  చాలా వరకు అందరూ వైఫై నెట్‌వర్క్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. దీనిని సర్వీస్‌సైట్ ఐడెంటీపెయిర్‌గా పిలుస్తారు. రూటర్ కనెక్షన్ ద్వారా దీనిని వినియోగిస్తారు. అయితే మీరు వినియోగించే రూటర్ పేరు మార్చి వాడుకున్నట్లయితే హ్యాకర్లకు ఈ పేరు తెలుసుకోవడం చాలాకష్టం. హ్యాకర్లు మీ రూటర్ కనెక్షన్, నెట్‌వర్క్ గురించి మాత్రమే తెలుసుకోగలుగుతారు. కానీ మీరు వ్యక్తిగతంగా సెట్ చేసుకున్న పేరును ఊహించుకోవడం కష్టం. అందుకే మీరు సాధారణ పేరును కాకుండా మీకు మాత్రమే తెలిసేలా మీ రూటర్ పేరుగా మార్చుకోవడం ఉత్తమం.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ కంప్యూటర్‌లోకి వస్తుంది. మరి దీనిని తీసివేయాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేయాలి. మీ సెట్టింగ్స్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి బ్రౌజర్ రీసెట్ చేయాలి. మీరు వేరే బ్రౌజరును ఉపయోగిస్తే మీ కంప్యూటర్‌లోని మాల్‌వేర్‌ను గుర్తించి తీసివేయడానికి యాంటివైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి. భవిష్యత్‌లో మీ కంప్యూటర్ మాల్‌వేర్ బారిన పడకుండా కాపాడుకునే చర్యలు చేపట్టుకోవాలి. మీ ఆపరేటింగ్ సిస్టం డేటాను ఆప్‌డేట్‌గా ఉంచుకోవాలి. మీరు క్లిక్ చేసే డౌన్‌లోడ్ వాటిని శ్రద్ధగా గమనించాలి. కొన్ని లింక్‌లు మీకు తెలియకుండానే వస్తాయి. అలాంటి వాటి జోలికి అసలు పోవద్దు. తెలియని ఫైల్స్ ప్రోగ్రామ్స్ డౌల్‌లోడ్ చేయవద్ద్దు. అలాగే ఏదైనా డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు చిన్నచిన్న పరిమాణంలో వచ్చే అక్షరాలను గమనిస్తుండాలి. ప్రతి ఒక్కరూ తాము ఇన్‌స్టాల్ చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి సంపూర్ణమైన అవగామన పెంచుకోవాలి. అప్పుడు మీరు ఉపయోగించే కంప్యూటర్లు, డేటాలు సురక్షితంగా ఉంటాయి. 

Related Posts