YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీల్లో లెక్కలు తవ్వుతారు

పంచాయితీల్లో లెక్కలు తవ్వుతారు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ధనప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్నికల సంఘం పటి ష్ట చర్యలు తీసుకుంటుంది.ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఖాతా ను తన పేరిట లేదా ఏజెంట్ పేరిట తెరవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల ఏజెంట్ పేరిట కాకుండా కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తుల పేరిట జాయింట్ ఖాతా తెరిచేందుకు అవకాశం లేదు. ఎన్నికల కోసం తెరిచిన ఖాతా లో సొంత డబ్బులు లేదా ఇతరుల నుంచి తీసుకున్న డబ్బులను వేసిన తరువాతనే తిరిగి డ్రా చేసి ఖర్చు చేయాలనే నిబంధన విధించారు. పంచాయతీరాజ్ చట్టం-20 18లోని 237 సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను తెరవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఎన్నికల వ్యయానికి సంబంధించి న వివరాల సేకరణకు ఈ ఖాతాలు కీలకంగా మారతాయ ని భావిస్తున్నదిఖాతాను సంబంధిత జిల్లా లేదా మండల పరిధిలోని జాతీయ, సహకార బ్యాంక్‌లతో పాటు పోస్టాఫీసుల్లోనూ తెరిచే వెసులుబాటు కల్పించారు. అభ్యర్థులు ఖాతాలు తెరిచేందుకు సహకరించాల్సిందిగా జిల్లా ఎన్నికల అథారిటీ త్వరలో బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేయనుంది. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థికి ఇప్పటికే ఇతర బ్యాంకుల్ల్లో ఖాతా ఉన్నా ఎన్నికల కోసం ఉపయోగించే వీలు లేదు.బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి వారు చేసే వ్యయాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చుగా లెక్క వేస్తారు. చెక్కులు, డ్రాప్టులు, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే వెసులుబాటును కల్పిస్తూ వ్యక్తు లు లేదా సంస్థలకు రూ. 5 వేలకు మించి నగదు రూపం లో ఇవ్వకుండా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల సమయంలో రూ. 10 వేలకు మించి అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లకుండా కట్టుదిట్టం చేయనుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో పాటు సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీని అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా చేయాల్సిన వ్యయంపైనా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా రూ. 80 వేలు, వార్డులో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేల వరకు ఖర్చు చేయవచ్చు. 10 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ. 40 వేలు, వార్డు అభ్యర్థులు రూ. 6 వేలు గరిష్టంగా ఖర్చు పెట్టొచ్చు. 

Related Posts