YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పల్లె పోరులో ధర్డ్ జెండర్ ఓట్లు

పల్లె పోరులో ధర్డ్ జెండర్ ఓట్లు

పల్లె పోరుకు రంగం సిద్ధం అవుతోంది. ఆగస్టులో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల కాలపరిమితి తీరిపోతుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లాలో 925 పంచాయతీల్లో  జాబితాలను ప్రదర్శించనున్నారు. 2013 ఓటర్ల జాబితాతో పోల్చితే ప్రస్తుత జాబితాలో 1,28,585 మంది ఓటర్లు పెరిగారు. వీరిలోను మహిళల ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2013లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 24,690 మంది అధికంగా ఉంటే 2018కి వచ్చేసరికి మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుదల 31,359 మందికి పెరగడం విశేషం. ఈసారి 60 మంది ఇతరులు కూడా ఓటర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వీటిని గ్రామాల్లో ప్రదర్శించాక వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తరువాత సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రదర్శనపై ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శలకు డీపీవో కృష్ణకుమారి ఆదేశాలు జారీచేశారు.అభ్యంతరాలు ఇతరత్రా అంశాలపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల సంఖ్య గతంతో పోల్చితే 8.3 శాతం పెరిగినట్లు అధికారులు తేల్చారు.నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాలను పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను వార్డుల వారీగా విభజించారు. ఈ జాబితాను గత నెల 15న ప్రదర్శించాల్సి ఉన్నా ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. అప్పట్లోనే పంచాయతీలకు ఓటర్ల జాబితాలను చేర్చినా ఇప్పటి వరకు అధికారికంగా ప్రదర్శించలేకపోయారు. ఎట్టకేలకు నెల రోజుల తరువాత వీటిని గ్రామాల్లో వేలాడదీయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం వీటి ప్రక్రియను పూర్తిచేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే పంచాయతీల్లో ఎన్నికలు జరగడానికి వీలుంటుంది. లేకుంటే ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. 

Related Posts