YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

12 చోట్లకు రెండు చోట్లే...లాజిస్టిక్ హబ్స్

12 చోట్లకు రెండు చోట్లే...లాజిస్టిక్ హబ్స్

భాగ్యనగరాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  సిటీలో 12 చోట్ల లాజిస్టిక్ హబ్స్ కు ప్రణాళికలు తయారు చేస్తు... రెండు చోట్ల మాత్రమే పట్టాలెక్కాయి. నగరంలో ట్రాఫిక్‌ తిప్పలు అన్నీఇన్నీ కావు. రాత్రిపూట ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరుకుల్ని తీసుకొచ్చే భారీ వాహనాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఈ వాహనాలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోపు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలి. ఆ సమయం దాటితే శివార్లలోనే వాహనాలను ఆపుకోవాల్సిన పరిస్థితి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదీకాకుండా ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించాయి. సరుకు రవాణాకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందిశివారుల్లో రెండుచోట్ల లాజిస్టిక్‌ పార్కుల పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. కొత్తగా మరో ఏడు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు కొంతవరకు తగ్గడమే కాదు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.నిల్వ చేసేందుకుగాను ప్రైవేట్‌ సంస్థలను శివారుల్లో భారీగా గోదాంలను నిర్మిస్తున్నారు. సరకు రవాణా రంగానికి చేయూతనిచ్చేందుకు హెచ్‌ఎండీఏ లాజిస్టిక్‌ పార్క్‌లపై దృష్టి సారించింది. గతంలో 12 చోట్ల పీపీపీ పద్ధతిలో నిర్మించాలని హెచ్‌ఎండీఏ అధికారులు కొన్నేళ్ల కిందటే ప్రతిపాదించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు.మొత్తానికి రెండోచోట్ల మాత్రం పనులు పట్టాలెక్కాయి.

Related Posts