YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వేస‌వి కానుక‌గా ‘2.0’. విడుద‌ల

వేస‌వి కానుక‌గా ‘2.0’.  విడుద‌ల

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌,  సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ చిత్రం ‘2.0’. ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. వేస‌వి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్  ట్విట్ట‌ర్‌లో ప్రకటించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ టీజ‌ర్ కార్యక్రమం జరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచార‌మ్‌. ఒకేసారి.. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన‌ టీజర్‌ల‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ న‌టుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ అగ్ర‌తార‌లు మోహన్‌లాల్‌, మమ్ముట్టి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

Related Posts