YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెట్రోైరెలు రెండోదశకు ఆర్థిక వెసులుబాటు కష్టమే

మెట్రోైరెలు రెండోదశకు ఆర్థిక వెసులుబాటు కష్టమే

ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న నిపుణులు 

ఖర్చు తగ్గించుకోగలిగితేనే మనుగడ  

డీపీఆర్ తయారీ బాధ్యత  వేగంగా రెండోదశ విస్తరణ: కేసీఆర్ ఆదేశం

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోైరెలును తీసుకెళ్లేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. మెట్రోైరెలు రెండోదశ విస్తరణ ప్రణాళికకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే బాధ్యతలను ఢిల్లీ మెట్రోైరెల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి అప్పగించారు. మెట్రోైరెలు రెండోదశ విస్తరణ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారని.. ఆ మేరకు డీపీఆర్ తయారుచేసే బాధ్యతలను డీఎంఆర్‌సీకి అప్పగించామని హైదరాబాద్ మెట్రోైరెల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డీఎంఆర్‌సీ నుంచి నిపుణులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని, ఎన్వీఎస్ రెడ్డి... ఇతర సీనియర్ అధికారులతో ప్రాథమిక చర్చలు కూడా జరిపారు. మొదటి దశ కంటే రెం డోదశలో మెట్రో రైలుకు ఆర్థిక  వెసులుబాటు కొంత కష్టంగానే ఉండొచ్చని అందువల్ల ఆదా యం పొందడానికి సృజనాత్మక ఆలోచనలతో పా టు విభిన్నైమెన పరిష్కారాలతో ఖర్చు తగ్గించే ఆలోచలు చేయాలని ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయుపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్కువ డిమాం డు ఉండే ప్రాంతాలకు ప్రయాణంతో పాటు.. మొదటిదశలో వివిధ ప్రాంతాలకు ఉన్న ‘గ్యాప్’లను పూడ్చే ప్రయత్నం చేయాలని డీఎం ఆర్‌సీకి సూచించారన్నారు. ప్రస్తుతమున్న బస్సు, రైలు వ్యవస్థలతో అనుసంధానించి శంషాబాద్ విమానా శ్రయం వరకు మెట్రోైరెలును విస్తరించాలని భావిస్తున్నారు. మెట్రోైరెలు మొదటిదశలో కొంత భాగాన్ని గత సంవత్సరం నవంబరు 28న ప్రా రంభించిన విషయం తెలిసిందే. నాగోల్- మియాపూర్ మధ్య గల 30 కిలోమీటర్ల మార్గం లో ప్ర స్తుతం రైళ్లు నడుస్తున్నాయి. తొలిదశలో మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోైరెలు తిరగాల్సి ఉంది. అయితే ఇంకా ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాలలో కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అలాగే నాగోల్-రాయుదుర్గం మార్గం లోనూ పనులు పూర్తికావాల్సి ఉంది. వీటిలో కొన్ని ఈ సంవత్సరం జూన్‌లోపు, మిగిలినవి ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని భావిస్తున్నారు.

Related Posts