YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరో రోజు కొనసాగుతున్న కేజ్రీ ధర్నా

ఆరో రోజు కొనసాగుతున్న కేజ్రీ ధర్నా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీక్ష ఆరవ రోజుకు చేరుకున్నది. ఆయన ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలోనే ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం రోజున భారీ ఎత్తున ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. దీని కోసం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా ప్రిపరేషన్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీ తీయనున్నారు. ఢిల్లీ ఐఏఎస్ ఆఫీసర్లు కేజ్రీ ప్రభుత్వానికి సహకరించడం లేదు. దీంతో కేజ్రీవాల్‌తో పాటు ఇతర మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు గవర్నర్ ఇంట్లో దీక్ష చేపట్టారుమ డిమాండ్లపై కేంద్రం మౌనం వీడకుంటే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలో నిరసన ఆరో  రోజుకు చేరింది.  ఐఏఎస్‌లు విధుల్లో పాల్గొనేలా చేసే విషయమై శుక్రవారం హోం మంత్రితో చర్చలు విఫలం కావటంతో ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. ఆదివారం నాటికి కేంద్రం నుంచి ఏ సమాధానం రాకుంటే ఇంటింటికీ వెళ్లి పదిలక్షల కుటుంబాల సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలుపుతామని ఆప్‌ ప్రకటించింది. ఈ పరిణామాలపై హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధాని మోదీని కలిసి చర్చించారు.ఢిల్లీ  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న నేపధ్యంలో అనిల్‌ బైజాల్‌   కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనే స్పష్టత లేకపోయినప్పటికి... కేజ్రివాల్‌ దీక్ష గురించే మాట్లాడుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేజ్రివాల్‌ దీక్షను విరమింపజేసే విషయంలో సహాయం చేసి, ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎల్జీ, రాజ్‌నాధ్‌ను కోరారనే ప్రచారం జరుగుతుంది. కానీ వీరి భేటిలో ఏం మాట్లాడారనే దాని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారుల ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల తీరును నిరసిస్తూ...ఆప్‌ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాజ్‌ఘాట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. ‘మోదీజీ ఫర్‌గివ్‌ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగించారు.

Related Posts