కారులో వెళుతూ ఓ యువకుడు చెత్తను నడి రోడ్డుపైనే పడేశాడు. ఆ సమయంలో అదే కారు పక్కనుంచి మరో కారులో వెళుతోన్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కారులోంచే ఆ యువకుడిని ప్రశ్నించింది. ఇలా ఎందుకు చెత్త రోడ్డుపై పడేశారు? అంటూ నిలదీసింది. ఈ ఘటన చోటు చేసుకుంటుండగా వీడియో తీసిన ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేశాడు. రోడ్డుపై చెత్త పడేసే వారు కనిపిస్తే వారిని ప్రశ్నించండని అన్నాడు.
A post shared by Virat Kohli (@virat.kohli) on Jun 16, 2018 at 4:43am PDT